నోటి మాటతోనే టెండర్ పనులు అప్పగించిన మంత్రి నారాయణ!

ప్రజావేదికను తమకు కేటాయించాలి అని కోరుతూ ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి తోలి లేఖను రాసిన సంగతి తెలిసిందే.జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత బాబు తోలి లేఖను సీఎం కు అందించారు.

 Crda Report Praja Vedika Was Built Without Any Proper Approvals-TeluguStop.com

అయితే బాబు లేఖను పక్కన పెట్టిన జగన్ సర్కార్ ఎలాంటి ఆలస్యం చేయకుండా ప్రజావేదికను ఖాళీ చేయాలి అని తెలిపి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందా లేదా అన్న దానిపై సీఆర్డీఏ విచారణ చేపట్టింది.

ఈ విచారణ లో భాగంగా ప్రజావేదిక నిర్మాణ విషయంలో అవినీతి జరిగింది అంటూ సీఆర్డీఏ తన నివేదికలో వెల్లడించింది.గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించిన వివరాలపై ప్రస్తుత ప్రభుత్వం సూచన మేరకు సీఆర్‌డీఏ ఈ నివేదిక అందించింది.

మున్సిప‌ల్, ప‌ట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్‌డీఏ అధికారులు నివేదిక అందజేయగా, ఆ నివేదిక లో ప్రజావేదిక నిర్మాణ విషయంలో అవకతవకలు జరిగాయని, తమ అనుమతి లేకుండానే ఈ నిర్మాణం జరిపినట్టు ఆ నివేదికలో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.అంతేకాకుండా అంచనాలను కూడా తారుమారు చేశారని,రూ.5 కోట్ల అంచనాలను 8.90 కోట్ల మార్చేసినట్టు సీఆర్డీఏ స్పష్టం చేసింది.

-Telugu Political News

కృష్ణానది కరకట్టలో నిర్మాణానికి అనుమతి నిరాకరించినప్పటికీ అప్పటి మంత్రి నారాయణ నోటి మాటతో టెండర్లు లేకుండానే పనులను అప్పగించి ఈ నిర్మాణం చేపట్టినట్లు సీఆర్డీఏ తన నివేదికలో వెల్లడించింది.ఇప్పటికే ప్రజావేదిక స్వాధీనం చేసుకోవడం పై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తమకు ఎలాంటి గడువు ఇవ్వకుండానే ఈ విధంగా ప్రజావేదిక లాక్కోవడం మంచి నిర్ణయం కాదంటూ నేతలు మండిపడుతున్నారు.అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ ప్రజావేదిక నిర్మాణం అవినీతి అనేది జరిగింది అంటూ సీఆర్డీఏ తన నివేదికలో తెలపడం తో ఇప్పుడు ఇరు పార్టీల మధ్య ఎలాంటి మాటల యుద్ధం చోటుచేసుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube