వీడియో: యాచకురాలితో బొమ్మల దుకాణం ప్రారంభం.. కంటతడి పెట్టుకుంటున్న నెటిజన్లు..

మన దేశంలో చాలామందికి తిండి, గుడ్డ లేక బాధపడుతున్నారు.అలాంటి వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది.

 Video: A Toy Shop Opens With A Beggar.. Netizens Are In Tears , Viral Video, Vir-TeluguStop.com

కొంతమంది బిచ్చమెత్తుకుంటున్నారు.ఇలాంటి ఒక మహిళ జీవితాన్ని మార్చేయడానికి ఒక మంచి మనసు గల వ్యక్తి ముందుకు వచ్చాడు.

అతడికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా( Social media )లో చాలా వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో, ఒక రోడ్డు మధ్యలో తన చిన్న కొడుకుతో కలిసి నిలబడి ఉన్న ఒక మహిళ కనిపించింది.ఆమె కారుల్లో వెళ్తున్న వారిని బిచ్చం అడుగుతోంది.కారుల్లో వెళ్తున్న ఒకాయన ఆమెను లెక్క చేయకుండా వెళ్లిపోయారు.

స్కూటీపై వెళ్తున్న మరొకాయన ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పాడు.ఆమె చాలా బాధగా ఉన్నప్పటికీ, తన కొడుకు ముందు ఆ బాధను చూపించలేదు.

తన కొడుకు వైపు చూసి నవ్వుతూ ఉంటుంది.తర్వాత ఓ చిన్నారి రోడ్డు దాటుతుండగా, ఒక మంచి మనసు గల వ్యక్తి వచ్చి అతన్ని ఎత్తుకుని రోడ్డు నుంచి దూరం పక్కకు తీసుకెళ్లాడు.

దాంతో సదరు యాచకురాలు భయంతో పరుగులు తీస్తూ తన కుమారుడిని కాపాడుకోవడానికి వస్తుంది.ఆ వ్యక్తి బిడ్డను తల్లికి ఇచ్చి, కొంచెం ఆగామని చెప్తాడు.తర్వాత తన కారు నుంచి బొమ్మల సంచి తీసుకొచ్చి రోడ్డు పక్కన పరుస్తాడు.యాచకురాలి( Beggar ) కళ్లకు గంతలు కట్టి, తాను ఏం చేశాడో చూపించడానికి తీసుకెళ్తాడు.

గంతలు తీసేసినప్పుడు, ఆమెకు బొమ్మల దుకాణం కనిపిస్తుంది.దాంతో చాలా సంతోషిస్తుంది పిల్లగాడికి కూడా చిన్న బొమ్మల దుకాణాన్ని చూపిస్తుంది.

ఆ వ్యక్తి చేసిన మంచి పనికి చప్పట్లు కొడుతుంది.చివరిగా ఆమె బొమ్మలు అమ్ముకుంటున్న దృశ్యంతో వీడియో ముగుస్తుంది.

వీడియో కింద ” బొమ్మల అమ్మే వీళ్ళని దేవుడు ఆశీర్వదించాలి” అని రాసి ఉంటుంది.ఆ వీడియో చూసిన చాలా మంది అతనిని మెచ్చుకున్నారు.

ఒకరు, ‘ఇలాంటి సహాయం చేయడమే నిజమైన సహాయం’ అని కామెంట్ చేశారు.మరొకరు, ‘అన్నయ్య, నీకు దేవుడు మంచి చేయాలి’ అని రాశారు.

మరొకరు, ‘నీవు చాలా గొప్పవాడివి అన్నయ్య‘ అని కామెంట్ చేశారు.ఈ వీడియోను లక్షకు పైగా మంది లైక్ చేశారు.

2 కోట్ల 70 లక్షల మందికి పైగా చూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube