వై నాట్ 175 అనే నినాదాన్ని ఎన్నికలకు ముందు వినిపించిమా ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేసనా, అవన్నీ వైసీపీ అధినేత జగన్ తో( YS Jagan ) పాటు, ఆ పార్టీ నాయకులకు ఎన్నికల ఫలితాల రూపంలో జలక్ ఇచ్చాయి.ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను( Welfare Schemes ) అమలు చేసినా, గతంలో ఎవరు చేయనంత స్థాయిలో ప్రజలకు సాయం అందించినా, వైసీపీ ఇంత ఘోరంగా ఓటమి చెందడానికి కచ్చితంగా ఆ పార్టీ అధినేత జగన్ వైకరే కారణం అన్న విషయం అందరికీ అర్థమైంది.
నియోజకవర్గల్లో ఎమ్మెల్యే ఎవరన్నది జనాలు పట్టించుకోరని, తన బొమ్మ చూసే ఓటు వేస్తారని జగన్ పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి.
వైసీపీ( YCP ) ఇంత ఘోరంగా ఓటమి చెందడానికి జగన్ తప్పిదాలే కారణం అనే విషయం అందరికీ అర్థమైంది.2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పూర్తిగా జనాల్లోనే ఉన్నారు .పాదయాత్ర పేరుతో ప్రతి ఒక్కరికి దగ్గర అయ్యారు .2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పూర్తిగా జనాలకు జగన్ దూరమయ్యారు .పార్టీ క్యాడర్ ను, పట్టించుకోలేదు.నాయకులకు స్వేచ్ఛ ఇవ్వకుండా మంత్రులను డమ్మీలుగా మార్చేశారనే విమర్శలు జగన్ పైన ఉన్నాయి. తాను సంక్షేమ పథకాల అమలుకు బటన్ నొక్కుతున్నానని, ఇక తమాకు తిరుగులేదని తన బొమ్మ మళ్ళీ పార్టీని గెలిపిస్తుంది అన్న భ్రమలోనే జగన్ ఉండిపోయాడు ఐదేళ్ల పాలనా కాలంలో ఎక్కువగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి జగన్ పరిమితం అయ్యారు.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని జగన్ పట్టించుకోలేదు.క్యాడర్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలిపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కొంతమంది కోటరీ నాయకుల ఫీడ్ బ్యాక్ ఆధారంగానే పాలనను సాగించారు.ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు.మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఘోరంగా వాటిని చెందడానికి ప్రధానంగా జగన్ వైఖరే కారణం.వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై( YCP MLA Candidates ) జనాల్లో సానుభూతి ఉన్నా.
అప్పటి వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న నేతలు సైతం ఓటమి చెందాల్సి వచ్చింది.ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా వైసిపి కి లేదు.
ప్రస్తుత టిడిపి ,జనసేన , బిజెపి కూటమి ప్రభుత్వంపై జగన్ మీడియా ముందుకు వచ్చి విమర్శలతో విరుచుకుపడుతున్నారు.సందర్భం దొరికితే చాలు జనాల్లోకి వస్తూ , పరామర్శల యాత్రను నిర్వహిస్తున్నారు.కానీ అధికారంలో ఉన్న సమయంలో పూర్తిగా క్యాంప్ కార్యాలయానికే పరిమితం అయ్యారు.ఇప్పుడు తీరిగ్గా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు.ఇకనైనా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా జన బలం ఉన్న నేతలను గుర్తించడంతో పాటు , వైసీపీకి మొదటి నుంచి అండగా నిలుస్తూ వస్తున్న కార్యకర్తలకు పెద్దపీట వేసే విధంగా జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది .అలాగే జనాలకు దగ్గర అయ్యే విధంగా నిరంతరం జనాల్లోనే ఉంటూ పార్టీ నాయకుల్లోనూ , జనాల్లోనూ అందరివాడిగా జగన్ గుర్తింపు సాధిస్తేనే , వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారం వస్తుంది .జగన్ తనను తాను మార్చుకుంటేనే విజయం సాధ్యం అవుతుంది.