వయసు పైబడినా కూడా కొందరు చాలా యవ్వనంగా కనిపిస్తుంటారు.ముఖంపై ఒక్క ముడత( Wrinkles ) కూడా ఉండదు.
అలాంటి వారిని చూసినప్పుడు కాస్త అసూయ కలగడం సహజమే.కానీ అసూయ పడడం వల్ల ఎటువంటి లాభం ఉండదు.
ఏజ్ పెరిగిన మీరూ యవ్వనంగా మెరిసి పోవాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే వంటింటి చిట్కాను అస్సలు మిస్ అవ్వకండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు( White Sesame ) వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత అర కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.అలాగే మరొక బౌల్ లో నాలుగు బాదం పప్పులు( Almonds ) కూడా వేసి నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పుతో పాటు బియ్యం, నువ్వులు కూడా వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పాలు( Milk ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేశారంటే మీరు ఊహించని లాభాలు మీ సొంతమవుతాయి.
ఈ వంటింటి చిట్కా మీ వయసులో దాచేస్తుంది.చర్మంపై ముడతలు ఉంటే వాటిని మాయం చేస్తుంది.సన్నని గీతలను తొలగిస్తుంది.
సాగిన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.స్కిన్ యవ్వనంగా మరియు గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
వయసు పెరిగిన కూడా యంగ్ గా కనిపించాలని భావించే వారికి ఈ హోమ్ రెమెడీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.అలాగే ఈ రెమెడీ స్కిన్ పై డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.