సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన చిత్రం పుష్ప 2.( Pushpa 2 ) దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.అయితే విడుదలకు ఇంకా పట్టుమని పది రోజులు కూడా సమయం లేదు.
కానీ ఇంతవరకు ఫైనల్ కాపీ ఇంకా రెడీ కాలేదు.షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా చివరి దశలో ఉన్నాయి.
దీంతో అసలు ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందా లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
![Telugu Allu Arjun, Pushpa, Pushpa Runtime, Pushpa Ups, Sukumar, Tollywood-Movie Telugu Allu Arjun, Pushpa, Pushpa Runtime, Pushpa Ups, Sukumar, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Pushpa-2-runtime-almost-fixed-detailss.jpg)
అయితే ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని డిసెంబర్ 1 నాటికి ఫైనల్ కాపీ రెడీ అవుతుందని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడులో జరుగుతున్నట్టు తెలుస్తోంది.చివరి సాంగ్ తో నవంబర్ 30 నాటికి అల్లు అర్జున్ తన పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేయనున్నాడు డైరెక్టర్ సుకుమార్.
( Director Sukumar ) ఇప్పటికే రఫ్ ఎడిట్ చేయించాడని, నిడివి 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని సమాచారం.మొత్తం వర్క్ పూర్తయ్యి, ఫైనల్ ట్రిమ్ అయ్యాక నిడివి కొంత తగ్గే అవకాశముందట.
మరోవైపు డిసెంబర్ 1 నాటికి పుష్ప 3( Pushpa 3 ) లీడ్ సీన్ షూట్ తో పాటు, అన్ని భాషల డబ్బింగ్ వర్క్స్ పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారట.
![Telugu Allu Arjun, Pushpa, Pushpa Runtime, Pushpa Ups, Sukumar, Tollywood-Movie Telugu Allu Arjun, Pushpa, Pushpa Runtime, Pushpa Ups, Sukumar, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Pushpa-2-runtime-almost-fixed-detailsa.jpg)
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా వేగంగా జరుగుతుందని, ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన 90 శాతం స్కోర్ చేసేశాడు.సామ్ సిఎస్, అజనీష్ లోకనాథ్, థమన్ మిగతా స్కోర్ పూర్తి చేసేలా పనిలో ఉన్నారు.మేకర్స్ కోరిక మేరకు, క్షణం తీరిక లేకుండా టీం అంతా కలిసి డిసెంబర్ 1 నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా శక్తికి మించి పని చేస్తున్నారట.
మరి ఈ సినిమా నిడివి మూడు గంటల 15 నిమిషాలు అంటే కొంతమంది అభిమానులు చాలా ఎక్కువ సమయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.