స్కిన్ వైట్నింగ్ కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారా? అయితే ఇలా చేయండి!

తమ ముఖ చ‌ర్మాన్ని తెల్లగా మెరిపించుకోవాల‌ని చాలా మంది ఆరాట‌ప‌డుతుంటారు.ఈ దిశ‌గా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

 Follow This Remedy And The Skin Will Become White Naturally! Home Remedy, Latest-TeluguStop.com

మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడటం కంటే.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ తో సహజంగానే చర్మాన్ని తెల్లగా మరియు కాంతివంతంగా మార్చుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్‌ను సపరేట్ చేయాలి.అలాగే పాలు కాచిన తర్వాత పైన పేరుకునే పాల మీగడ ని తీసుకుని పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు పాల‌ మీగడ, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వ‌న్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ శెనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Skin, Skin Remedy-Telugu

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వాట‌ర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ రెమెడీని గ‌నుక‌ పాటిస్తే కొద్ది రోజుల్లోనే స్కిన్ టోన్ వైట్ గా మ‌రియు బ్రైట్ గా మారుతుంది.చర్మంపై ఏమైనా మొండి మచ్చలు ఉన్నా క్రమంగా మాయం అవుతాయి.

మరియు చర్మం మృదువుగా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube