మొన్ననే పెళ్లి అయ్యింది, ఆగలేక పోతున్నా, పది రోజులు సెలవు కావాలి.. కానిస్టేబుల్‌ సెలవు దరకాస్తు

కొత్తగా పెళ్లి అయిన వారి పరిస్థితి కొన్ని సార్లు దారుణంగా ఉంటుంది.పెళ్లి అయిన తర్వాత వారం పది రోజులు బందువుల ఇంటికి, పూజలు అంటూ తిప్పుతారు.

 Newly Married Constable Wrote 10 Days Leave Letter Goes Viral-TeluguStop.com

తీరా హడావుడి అంతా పూర్తి అయ్యింది, ఫస్ట్‌ నైట్‌ కు ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్న సమయంలో అబ్బాయి లేదా అమ్మాయి సెలవులు అయిపోతాయి.అంతా హడావుడిగా జరుగుతుంది.

ఆ మూడు రాత్రులు జరిగినా జరుగకున్నా కూడా హడావుడిగా డ్యూటీలకు వెళ్లే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.ఎందుకంటే వారు భాగస్వామిని వదిలి ఉండలేక, డ్యూటీపై ఫోకస్‌ చేయలేక ఇబ్బంది పడతారు.

అలా అని మరో పది రోజులు సెలవు అడుగుదామా అంటే మొహమాటం.

కర్ణాటకలోకి బేగూర్‌ పీఎస్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ మారుతికి ఇదే పరిస్థితి ఎదురైంది.

గత నెల చివరి వారంలో పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి అయిన తర్వాత ఇతగాడు పది రోజుల పాటు బందువుల ఇల్లు అంటూ అటు ఇటు తిరగాడు.

పెళ్లి కోసం పెట్టుకున్న పదిహేను రోజుల సెలవులు పూర్తి అయ్యాయి.దాంతో మళ్లీ డ్యూటీలో చేరాల్సి వచ్చింది.

భార్యకు దూరంగా ఉండటం అతడి వల్ల కాలేదు.ప్రతి రోజు వెళ్లి వచ్చే పరిస్థితి లేదు.

ఫ్యామిలీ పెట్టేందుకు సరైన సమయం కాదు.దాంతో అతడు చేసేది లేక మళ్లీ సెలవు కోరుతూ పెట్టాడు.

మారుతి తన లీవ్‌ లెటర్‌ లో తన బాధను క్లీయర్‌ గా వివరించాడు.ఆ బాధను చూడలేక అయినా తన ఉన్నతాధికారులు సెలవు ఇస్తారని ఆశించాడు.

మారుతి లీవ్‌ లెటర్‌ లో… నాకు ఈమద్యనే పెళ్లి అయిన సంగతి మీకు తెలిసిందే.నా భార్యతో కలిసి కొన్ని పూజలు చేయాల్సి ఉంది.ఊర్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు అలాగే ఉన్నాయి.ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి ఇన్నాళ్లకు అయ్యింది.ఆ కారణంగా ఇక ఆగలేక పోతున్నాను.అందుకే నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు మరో పది రోజుల సెలవులు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను అంటూ స్వహస్థాలతో రాశాడు.

ఈ లేఖ అందుకున్న సీఐ ఆశ్చర్యంతో నవ్వుకుని ఉంటాడు.మారుతికి సెలవులు ఇచ్చారో లేదో తెలియదు కాని, ఈ లేఖ మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

పెళ్లి అయిన కొందరు పాపం మారుతికి పది రోజులు కాదు దయచేసి నెల రోజులు సెలవు ఇవ్వండి సార్‌ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.మరి మీరు ఏమంటారు.

సెలవు ఇవ్వాలనేది మీ అభిప్రాయమా, లేదంటే మొన్ననే పది రోజులు తీసుకున్నాడు కదా మళ్లీ ఎందుకు అంటారా.మీ సమాధానం కామెంట్‌ చేయడం మాత్రం మర్చి పోకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube