సాధారణంగా చెప్పాలంటే ముహూర్తాలను ( Muhurat ) వివాహానికి శుభదినంగా పూర్వకాలం నుంచి పరిగణిస్తూ ఉన్నారు.కానీ మీ పెళ్లి రోజు మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
సంఖ్యాశాస్త్రంలో ( Numerology ) సంఖ్యలకు ప్రత్యేకించి ప్రాముఖ్యత ఉంది.సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ వివాహ తేదీ ఆధారంగా మీ భవిష్యత్తు వైవాహిక జీవితాన్ని ఎలా అంచనా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ వివాహ తేదీలో( Wedding Date ) దాగి ఉన్నా రహస్యాలను బహిర్గతం చేయడానికి మీరు ముందుగా దాని వివాహ తేదీన లెక్కించాలి.ఉదాహరణకు మీరు నవంబర్ 26 2021 వ తేదీన వివాహం చేసుకున్నట్లయితే మీ వివాహ సంఖ్య 6.ఎలాగంటే ఈ అంకెలను ఒక్కొక్కదానిగా కలిపితే ఆరు (2+6 +1+1+2+0+2+1) వస్తుంది.
మీ వివాహ తేదీ సంఖ్య ఒకటి అయితే అది కొత్త ప్రారంభాలు మరియు స్వేచ్ఛను సూచిస్తుంది.
మీ వివాహ సంఖ్య న్యాయకత్వంతో మరియు విజయవంతం కావాలని బలమైన సంకల్పంతో నిండి ఉంటుంది.అలాగే మీ వివాహ తేదీ సంఖ్య రెండు అయితే సామరస్యం మరియు సహకారంతో నిండిన యూనియన్ సూచిస్తుంది.
మీ వివాహం సమతుల్యత మరియు తెలివితేటలతో నిండి ఉంటుంది.అలాగే మీ వివాహ తేదీ సంఖ్య 3 అయితే మీ వైవాహిక జీవితంలో( Marriage Life ) సృజనాత్మకత మరియు స్వీయ వ్యక్తికరణ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మీరు ఉత్తేజ కరమైన మరియు సంతోషకరమైన వివాహాన్ని ఆశించవచ్చు.అలాగే వివాహ సంఖ్య నాలుగు స్థిరత్వం మరియు సంకల్పాన్ని సూచిస్తుంది.మీ వివాహం ఒక బలమైన పునాదిగా నిర్మించబడవచ్చు.మీ వివాహ సంఖ్య 5 అయితే సాహసం మరియు మార్పును సూచిస్తుంది.ఎప్పటికప్పుడు మారుతున్న సంబంధం కలిగి ఉండవచ్చు.అలాగే మీ వివాహ సంఖ్య ఆరు అయితే ఇది సామరస్య పూర్వకమైన మరియు శ్రద్ధ గల వివాహాన్ని సూచిస్తుంది.

అలాగే మీ వివాహ సంఖ్య 7 అయితే రహస్యాలను సూచిస్తుంది.మీ వివాహం లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉంటుంది.మీ వివాహ సంఖ్య ఎనిమిది అయితే భౌతిక విజయాన్ని సూచిస్తుంది.మీ వివాహం ఆర్థిక శ్రేయస్సు మరియు వృత్తి పై బలమైన దృష్టిని కలిగి ఉండవచ్చు.అలాగే మీ వివాహ సంఖ్య 9 అయితే అది దయగల వివాహాన్ని సూచిస్తుంది.మీ వివాహ జీవితం సమాజానికి మేలు చేస్తుంది.
DEVOTIONAL