శనివారం హిందూమతంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడింది.అందుకే శనివారం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు.
చేస్తే శని దేవుడు ఆగ్రహిస్తాడు.అయితే శని దేవుని అసంతృప్తికి గురి చేసే ఎలాంటి తప్పు కూడా చేయకూడదు.
ఎందుకంటే శని దేవుడుని సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం.శని దేవుడు( Shani Dev ) కోపంగా ఉంటే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నం.కాబట్టి ఈ శనివారం నాడు నల్ల రంగు దుస్తులను ధరించాలి.
అలాగే ఏదైనా నల్ల జంతువుకి లేదా కాకికి ఆహారం తినిపించాలి. అయితే శనివారం రోజు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

శనివారం రోజు మాంసం తినడం, మద్యం సేవించడం అస్సలు మంచిది కాదు.శనీశ్వరుడి దృష్టిలో ఇది అనుచితమైన పాపపు చర్య కావడంతో ఇలా చేయకూడదు.ఇలా చేసే ఆ వ్యక్తిని శనీశ్వరుడు కచ్చితంగా శిక్షిస్తాడు.ఇక శనివారం( Saturday ) రోజున బొగ్గు, తోలు, బూట్లు, నల్ల నువ్వులు, మినప్పప్పు, చీపురు( Broom ) నూనె, కలప, ఇనుము వస్తువులను కొనుగోలు అస్సలు చేయకూడదు.
కొనుగోలు చేస్తే మాత్రం జీవితంలో కష్టాలు తలెత్తుతాయి.శనివారం తూర్పు, దక్షిణ, ఈశాన్య వైపు ప్రయాణించకుండా ఉండాలి.ఇలా ప్రయాణించడం వలన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి అస్సలు వెళ్ళకూడదు అని నమ్ముతారు.

దీని వలన అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది.అలాగే శనివారం రోజున ఏ బలహీనతమైనా లేదా నిస్సహాయ వ్యక్తిని అవమానించడం లేదా అతన్ని బాధ పెట్టడం చేయకూడదు.ఇక శనివారం ఇలా చేయడం వలన శని దేవుని దృష్టిలో మీరు పాపంలో భాగస్వాములే అవుతారు.అలాంటి వ్యక్తికి శనీశ్వరుడు ఎంతో కఠినమైన శిక్షను ఇస్తాడు.శనివారం పాలు, పెరుగు తినకూడదని నమ్ముతారు.అలాగే శనివారం నాడు బెండకాయ, మామిడికాయ పచ్చడి, పండు మిరపకాయలు కూడా తినకుండా ఉండాలి.