ముఖ్యంగా చెప్పాలంటే నాగుల పంచమి( Nagula Panchami ) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని నాగదేవత దేవాలయాలు భక్తులతో రద్దీగా ఉన్నాయి. నాగుల చవితి సందర్భంగా చాలామంది మహిళలు ఉపవాసాలను పాటించారు.
బాలికలు సోమవారం రోజు నాగుల పంచమి సందర్భంగా నాగదేవత దేవాలయానికి వచ్చి ఉపవాస దీక్ష( Fasting )లు విరమించుకున్నారు.నాగుల పంచమి రోజున శివుడితోపాటు నాగ దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ ఏడాది నాగుల పంచమి ఆగస్టు 21వ తేదీన జరుపుకున్నారు.అందులోనే ప్రత్యేకమైనదిగా భావించే శ్రావణ సోమవారం రోజు నాగుల పంచమి రావడం మరింత ప్రత్యేకం అని పండితులు చెబుతున్నారు.

అయితే నాగపంచమి రోజున హిందువులు ( Hindus )కొన్ని పనులను అస్సలు చేయకూడదు.అవి ఏంటంటే పాములకు హాని కలిగించే పనులు అస్సలు చేయకూడదు.వాటికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు.సాధారణంగా పండుగ అంటేనే భక్తికి సంబంధించిన విషయం.పాములకు హాని తలపెట్టడం అనేది ఆధ్యాత్మిక భావానికి విరుద్ధంగా ఉంటుంది.ఆలయాలలో పాముల ప్రదర్శన చేయకూడదు.
పుట్ట మీద పామును వదిలి ఆ పాము చుట్టూ చేరి అగరవత్తులు, దీపాలు వెలిగించి ఏక ధారగా పాలు పోస్తే ఆ పాములు ఊపిరాడక చనిపోవడం ఖాయం.

కాబట్టి అలాంటి పనులను మీరు అస్సలు చేయకూడదు.ఎందుకంటే భూమి పై పాముల ( snakes )సంఖ్య తగ్గిపోతే పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.సాంప్రదాయం ప్రకారం పుట్టకు పాలు సమర్పించడం ఒక స్థాయి వరకు మాత్రమే మంచిది అని పండితులు చెబుతున్నారు.
అధిక మొత్తంలో పాలన ఉపయోగించడం అవసరం లేదు.దీని వల్ల అటు పాములకు ఇటు పాల అవసరమున్న జనాలకు ఇబ్బందే నన్ను సంగతిని మర్చిపోకూడదు.
మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో పాము కనబడితే వెంటనే భక్తితో దాని దగ్గరికి వెళ్లి పాముకు పాలు పోయడం, హారతులు ఇవ్వడం వంటివి అసలు చేయకూడదు.ఎందుకంటే పాము కాటు వేసే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి పాముకు దూరంగా ఉండటమే మంచిది.