మకర సంక్రాంతి రోజున ఇక్కడ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయా..

మన దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పండుగలకు వాటి ప్రాముఖ్యత ఉంటుంది.ఒక్కో పండుగకు ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం కూడా ఉంటుంది.

 If You Take A Bath Here On Makara Sankranti  Will The Sins Of Seven Births Be Re-TeluguStop.com

కొన్ని పండుగలను అన్ని కులాలు, వర్గాలు కలిపి జరుపుకుంటారు.అన్నీ పండుగలలో ప్రత్యేక పండుగ మకర సంక్రాంతి ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

వివిధ రాష్ట్రాల ప్రజలు మకర సంక్రాంతిని వివిధ పేర్లతో విభిన్న రీతుల్లో జరుపుకుంటూ ఉంటారు.సంక్రాంతిని దక్షిణ భారతదేశంలో పొంగల్ అని పిలుస్తూ ఉంటారు.

మకర సంక్రాంతి రోజున గంగా స్నానం చేయడం ఎంతో మంచిది.సంక్రాంతి రోజున గంగా నదిలో స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

చాలామంది భక్తులు మకర సంక్రాంతి రోజు గంగా నదిలో స్నానం చేసి దానధర్మాలు చేస్తూ ఉంటారు.అందుకే సంక్రాంతి రోజు గంగ ఘాట్లన్నీ భక్తులతో రద్దీగా ఉంటాయి.

పుణ్యం పొందాలంటే ఏ ప్రదేశంలో స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.గంగా సముద్రం పశ్చిమబెంగాల్లోని పవిత్ర ప్రదేశం మకర సంక్రాంతి రోజున గంగాసముద్రంలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

ఇక్కడ గంగా నది సముద్రం రెండూ కలుస్తాయి.కాబట్టి ఈ ప్రాంతానికి గంగాసాగర్ అనే పేరు కూడా వచ్చింది.

సంక్రాంతి రోజు ఇక్కడ స్నానం చేసిన వారికి పది అశ్వమేధ యాగాలు చేసిన 1000 గోదానాలు చేసినంత ఫలితాలు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.ప్రయాగరాజ సంఘం అత్యంత పవిత్రమైన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి.

Telugu Bath, Devotional, Ganga River, Haridwar, Sankrant, Bengal-Latest News - T

సంక్రాంతి రోజు ఇక్కడ స్నానం చేస్తే కష్టాలన్నీ దూరమైపోయి సుఖసంతోషాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు.గంగా యమునా సరస్వతి నదుల సంగమం కనుక దీనిని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు.హరిద్వార్ పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి.సంక్రాంతికి హరిద్వార్లో చాలామంది గంగా స్నానం చేస్తూ ఉంటారు.హరిద్వార్ హర్కి పోడీలో చాలా ఘాట్లు ఉన్నప్పటికీ విష్ణు ఘాట్ అత్యంత ప్రసిద్ధి చెంది ఉంది.భక్తులు గంగా నదిలో స్నానం చేసి పాపాలను తొలగించుకుంటూ ఉంటారు.

ఇక్కడ పుణ్య స్నానం చేస్తే 1000 గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్మకం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube