ఎండు మిరపకాయలతో ఇలా చేయడం వల్ల నరదృష్టి తొలగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు దూరం..!

ఎండు మిరపకాయలను దాదాపు ప్రజలందరూ వంట గదిలో వంట చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు.అయితే ఎండు మిరపకాయలు ఆహారానికి రుచినీ పెంచడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల సమస్యలకు, చెడు దృష్టి నివారణకు కూడా ఉపయోగపడతాయని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.

 By Doing This With Dry Chilies, Nara Drishti Is Removed And Financial Problems-TeluguStop.com

జ్యోతిష శాస్త్ర నిపుణుల ప్రకారం ఎండుమిరపకాయలు ఉపయోగించడం ద్వారా చెడు దృష్టిని త్వరగా దూరం చేసుకోవడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఏదైనా పనిలో విజయం సాధించాలంటే కూడా ఎండుమిరపకాయలతో వాస్తు నివారణలు చేయడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

చాలామంది నరదృష్టి( Nara Drishti ) దోషాలతో బాధపడుతూ ఉంటారు.అటువంటి నరదృష్టి దోషాల వల్ల జీవితంలో అన్నీ ఉన్న రకరకాల సమస్యలను లతో బాధపడుతూ ఉంటారు.

Telugu Devotional, Lakshmi Devi, Drishti, Vastu, Vastu Tips-Telugu Bhakthi

నరదృష్టి ఉన్నప్పుడు ఏ పని చేసిన ఆ పనిలో రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి నర దృష్టిని తొలగించుకోవడానికి,నర దృష్టి నుంచి ఉపశమనం పొందడానికి 7 ఎండు మిరపకాయలు తీసుకుని వాటిని తలపై నుంచి ఏడు సార్లు, నేరుగా, మళ్లీ ఏడుసార్లు రివర్స్ లో తిప్పి ఆ ఎండు మిరపకాయలను మంటలు వేయాలి.ఇలా చేయడం వల్ల నరదృష్టి నుంచి ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా ఏదైనా పని చేయాలని భావించి ఆ పని చేయడానికి ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కూడా ఎండుమిరపకాయలు( Dry chilies ) మంచి రెమెడీగా పనిచేస్తాయి.

Telugu Devotional, Lakshmi Devi, Drishti, Vastu, Vastu Tips-Telugu Bhakthi

దీనికోసం ఏదైనా పనికి బయటకు వెళ్ళేటప్పుడు 5 మిరపకాయలు తీసుకొని ఇంటి గుమ్మం ముందు ఉంచి ఆ తర్వాత చేయాల్సిన పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాలని చెబుతున్నారు.ఎండుమిరపకాయలు ప్రతికూల ప్రభావాలను తగ్గించి సానుకూల ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.అంతే కాకుండా ఇంట్లో బాగా డబ్బులు ఉండాలంటే, లక్ష్మీదేవి ( Lakshmi Devi )అనుగ్రహం కలగాలంటే ఏడు ఎండుమిరపకాయలను ఒక గుడ్డలో కట్టి మీరు డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ దానిని ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube