ఈ చెట్టు కింద‌కు వెళ్తే ప్రాణాలు పోతాయంట‌..

ఈ భూమ్మీద ఉన్న‌న్ని ర‌హ‌స్యాలు మ‌రెక్క‌డా లేవు.ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక సృష్టి ర‌హ‌స్యాలు ఇప్ప‌టికీ ఎవ‌రి ఊహ‌కు కూడా అంద‌ట్లేదు.

 If You Go Under This Tree You Will Lose Your Life Details, Dangerous Tree, Viral-TeluguStop.com

మాన‌వులు ఎన్నో వాటిమీద ప్ర‌యోగాలు చేస్తున్నా కూడా ఇంకా అనేక ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొర‌క‌ట్లేదు.ఈ సృష్టిలో ప్ర‌తి జీవికి ప్రాణ‌వాయువు ఎంత ముఖ్య‌మో మ‌నంద‌రికీ తెలిసిందే.

ఇన్ని జీవుల‌కు ప్రాణ వాయువును ఇచ్చేవి ఒక్క చెట్లు మాత్ర‌మే.అది లేక‌పోతే మ‌నుగ‌డ అసాధ్యం.

అయితే కొన్ని చెట్లు మాత్రం ప్రాణాల‌కు ప్ర‌మాద‌క‌రంగా కూడా ఉంటున్నాయి.ఇలాంటి వాటి గురించి తెలిస్తే నిజంగానే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

ఎందుకంటే చెట్లు ఎక్క‌డైనా ప్రాణాల‌ను నిలుపుతాయి కానీ ప్రాణాల‌కు హాని త‌ల‌పెట్ట‌వు.ఇక పోతే ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి మిస్ట‌రీ చెట్లు అనేకం ఉన్నాయి.మొన్న‌టికి మొన్న కిత‌కిత‌లు పెట్టే చెట్టు గురించి విన్నాం.ఇంకో చోట నీడ ప‌డ‌ని చెట్ల గురించి కూడా వింటున్నాం.

లండ‌న్ లోని ఓ తోట‌లో అయితే ముట్టుకుంటేనే విప‌రీత‌మైన వ్యాధులు వ‌చ్చే పూల చెట్లు గురించి కూడా తెలుసుకున్నాం.ఇప్పుడు విన‌బోయే చెట్టు కూడా ఇలాంటి కోవ‌కు చెందిన‌దే.

అయితే ఇది కూడా పూల జాతికి చెందిక‌న‌దే కావ‌డం వివేషం.

దీని పేరు బీచ్ యాపిల్‌. సేమ్ టు సేమ్‌ యాపిల్‌ చెట్లను పోలిన‌ట్టు ఉంటుంది.అయితే ఇది చూడ‌టానికి అందంగా ఉన్నా అత్యంత విషపూరితమైనది.

దీని నుంచి నిత్యం పాల లాంటి ద్రవాలు కారుతుంటాయి.వాటిని తాకినా లేదంటే దాని పండ్లు తిన్నా స‌రే ప్రాణాలు పోతాయి.

ఈ చెట్టును ఎక్క‌డ ముట్టుకున్నా దద్దుర్లు, దుర‌ద లాంటివి భ‌యంక‌రంగా వ్యాపిస్తాయి.దీని కింద‌కు వెళ్లినా దాని పాలు మీద ప‌డి శ‌రీరం మొత్తం ఇన్ఫెక్ష‌న్ సోకుతుంద‌ని చెబుతున్నారు ఇక్క‌డి వారు.

దాని ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌కుండా చాలా దూరంగా ఉంటున్నామ‌ని వారు వివ‌రిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube