అసలే ప్రస్తుతం చలి కాలం కొనసాగుతుంది.ఈ సీజన్ లో తరచూ వేధించే సమస్యల్లో జలుబు ముందు వరుసలో ఉంటుంది.
పైగా ఈ సీజన్లో జలుబు పట్టుకుంది అంటే అంత సులభంగా వదిలి పెట్టదు.జలుబు కారణంగా ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే కేవలం రెండు రోజుల్లోనే ఉక్కిరి బిక్కిరి చేసే జలుబును తరిమికొట్టొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.జలుబును నివారించడంలో తులసి టీ అద్భుతంగా సహాయపడుతుంది.అందుకే జలుబు చేసినప్పుడు ఖచ్చితంగా రోజుకు ఒక కప్పు తులసి టీను తీసుకోవాలి.తద్వారా జలుబు త్వరగా దూరం అవుతుంది.
అలాగే జలుబు వేధిస్తున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె ఒక గిన్నెలో వేసుకుని బాగా మిక్స్ చేసి తీసుకోవాలి.ఆపై గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.
ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే జలుబు రెండు రోజుల్లో తప్పకుండా తగ్గుముఖం పడుతుంది.

జలుబు సతమతం చేస్తున్నప్పుడు నైట్ నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పావు టేబుల్ స్పూన్ పసుపు కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దీంతో జలుబు చాలా వేగంగా తగ్గుతుంది.
జలుబు చేసినప్పుడు తాగడానికి మరియు స్నానం చేయడానికి చల్లటి నీటిని పొరపాటున కూడా వాడరాదు.వేడి నీటిని మాత్రమే ఉపయోగించాలి.అప్పుడే జలుబు నుండి త్వరగా బయటపడతారు.ఇక జలుబు మదన పెడుతున్న సమయంలో ఉసిరి, పైనాపిల్, నిమ్మ, కివి వంటి పండ్లను తీసుకోవాలి.
ఇవి జలుబును చాలా వేగంగా తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి.