గుడిలోకి ప్రవేశించోద్దని.. దళితులపై దాడి.. పెళ్లి అగిపోయిందా..

 గుడిలోకి ప్రవేశించోద్దనిదళితులపై దాడి 21వ శతాబ్దంలోకి ప్రవేశించిన ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో దళితులపై వివక్ష కొనసాగుతుంది.దేశములో దళితులపై వివక్ష రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చిన  విషయం తెలిసిందే.

 Entered The Temple .. Attack On Dalits .. Did The Wedding Break Up,  Attack On D-TeluguStop.com

అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సంఘటన తరచుగా జరుగుతూనే ఉన్నాయి.తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఇండోర్ జిల్లాకు చెందిన వికాస్ కల్మోడియా అనే  యువకుడు వివాహం చేసుకున్నాడు.ఈ క్రమంలో అతను, కుటుంబ సభ్యులు స్థానిక ఆలయానికి చేరుకున్నారు. 

కొంతమంది యువకులు పెళ్లి బృందాన్ని ఆలయంలోకి ప్రవేశించి కుండా అడ్డుకున్నారు దీంతో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.వరుడి బంధువులు ఆలయంలో ప్రవేశించిదే లేదని అడ్డుకున్నారు.

అంతటితో ఆగకుండా వివాహ బృందం పై దాడికి తెగబడ్డారు.ఈ క్రమంలో తండ్రి ఓం ప్రకాష్ తమపై దాడి చేసిన యువకులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివాహ బృందాన్ని భారీ భద్రత మధ్య ఆలయ దర్శనం కల్పించారు ఆ తర్వాత  9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube