టూత్ పేస్ట్ అనుకుని ఎలుక‌ల మందుతో ప‌ళ్లు తోముకున్న అమ్మాయి.. చివ‌ర‌కు

టూత్ బ్రష్‌కు బదులుగా షేవింగ్ క్రీమ్ పెట్టుకుని పళ్లు తోముకునే సీన్‌ను మనం తెలుగు సినిమాల్లో చూసే ఉంటాం.అయితే, కొన్ని చిత్రాల్లో షేవింగ్ క్రీమ్ మాత్రమే కాకుండా ఫెవికాల్ పెట్టుకుని పళ్లు తోముకున్నట్లు దర్శకులు చూపిస్తుంటారు.

 The Girl Who Felt Like Toothpaste And Brushed Her Teeth With Rat Poison, Toothpa-TeluguStop.com

అయితే, అది ఫన్నీగా చేసిన ఇన్సిడెంట్ మాత్రమే.నిజజీవితంలో టూత్ పేస్ట్‌కు బదులుగా వేరే క్రీమ్ పెట్టుకుంటే చాలా ఇబ్బందులే వస్తాయి.

కాగా, రియల్ లైఫ్‌లో ఇటువంటి ఓ సాడ్ ఇన్సిడెంట్ జరిగింది.వివరాల్లోకెళితే.

ఓ యువతి నిద్రమత్తులో టూత్ పేస్టుకు బదులుగా రాట్ పాయిజన్ పెట్టుకుని పళ్లు తోముకుంది.అయితే, ఆ విషయం ఆమె అంత త్వరగా గ్రహించలేకపోయింది.

దాంతో ఆమె తన ప్రాణాలనే కోల్పోయింది.ఈ ఘటన మహారాష్ట్రలో జరగగా ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ముంబైలోని ధారావికి చెందిన ఓ 18 ఏళ్ల యువతి అఫ్సానా ఖాన్ రోజులాగానే తాను టూత్ పేస్ట్ పెట్టి పళ్లు తోముకుంటున్నానని భావించింది.కానీ, ఆమె టూత్ పేస్టు కాకుండా ఎలుకల మందును పేస్టుగా వాడింది.

ఇటీవల ఆమె ఉదయం మూడు గంటలకు నిద్రలేచి నిద్రమత్తులో ఇలా చేసింది.ఎలుకల విషాన్ని పేస్టుగా భావించి పళ్లు తోముకుంది.

అంతే.ఎలుకల విషయం ఆమె కడుపులోకి ప్రవేశించి ఆమె చనిపోయింది.

Telugu Afsana Khan, Brushteeth, Dharavi, Maharashtra, Mumbai, Rat Poison, Toothp

అయితే, సాధారణంగా పళ్లు తోముకునే ముందర పేస్టు నోట్లో పెట్టుకున్నపుడు ఫ్లేవర్ తెలుస్తుందని, దానిని బట్టి అది పేస్టో కాదో నిర్ధారించుకోవచ్చని పలువురు చెప్తున్నారు.ఎంత నిద్ర మత్తులో ఉన్నప్పటికీ ఎలుకల మందుకు, టూత్ పేస్టుకు మధ్య తేడాను గమనించకపోవడం ఆశ్చర్యకరమని, అలా గమనించకపోవడం వల్లే ఆమె తన ప్రాణాలను కోల్పోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇకపోతే వైద్యులు ట్రీట్‌మెంట్ చేసినప్పటికీ అప్పటికే ఆమె శరీరంలోని పలు భాగాల్లోకి ఎలుకల మందు వెళ్లిందని, దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చిందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube