ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్( Ormax Media ) గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల అందరికీ తెలిసిందే.దేశంలోని అన్ని సినీ రంగాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ సరైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది.
ముఖ్యంగా సినీ తారలు, సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటిపై సర్వేలు చేస్తుంటుంది.తాజాగా డిసెంబర్ 2024 జనవరి నెలకు సంబంధించి తెలుగు టాప్ హీరోల లిస్టు( Tollywood Top Heroes List )ను విడుదల చేసింది.
అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేధికగా ప్రకటించింది.అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా ప్రభాస్( Prabhas ) మొదటి స్థానంలో నిలిచారు.
సలార్ తో సూపర్ హిట్ కొట్టిన ఈయన స్థానాన్ని ఎవరూ లాక్కోలేకపోతున్నారు.

ఇక టాప్ 2లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు.ఇటీవలే గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈయన.టాప్ 4 నుంచి టాప్ 2కి ఎగబాకాడు.ఇక టాప్ 3లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నిలిచాడు.గత ఏడాదిలో ఒక్క సినిమా కూడా చేయని ఆయన ఈ ఏడాది పుష్ప2తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నాలుగో స్థానానికి పరిమితం అయ్యాడు.2023లో ఈయన ఏ సినిమా చేయకపోయినప్పటికీ.ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమా( Devara )తో ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు.అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐదో స్థానంలో ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయన కూడా ఒక్క సినిమాలో కనిపించలేదు.

గేమ్ ఛేంజర్( Ram Charan Game Changer ) తో ఈ ఏడాది వచ్చేందుకు సిద్ధం అవుతుండగా టాప్ 10 హీరోల లిస్టులో5వ స్థానంలో నిలిచాడు.ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిలిచారు.ఇక టాప్ 7లో నాచురల్ స్టార్ నాని( Nani ) ఉన్నారు.
ఇటీవలే ఈయన హాయ్ నాన్న సినిమాతో వచ్చి అందరినీ తెగ అలరించారు.ఇక ఎనిమిదవ స్థానంలో మాస్ మహారాజా రవితే ఉండగా, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 9వ స్థానంలో నిలిచాడు.
ఫ్యామిలీ స్టార్ తో త్వరలోనే ఈయన ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నారు.ఇకా టాప్ 10లో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఉన్నారు.