లాక్ డౌన్ తర్వాత సామాజిక అంశాలు, వలస కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలని వెల్లడించడంతో పాటు ప్రభుత్వానికి కూడా జనసేన అధినేత సూచనలు చేస్తున్నారు.అయితే ఎప్పటిలానే పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎదురుదాడి చేయడంపైనే దృష్టిపెట్టింది.
ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న ఆంధ్రా వలస కార్మికులని ఆదుకోమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.వాటిపై అక్కడి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాయి.
ఇక ఏపీలో పెరిగిపోతున్న కరోనా కేసులు, ప్రభుత్వం అలసత్వంపై పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు.వాటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రాకపోగా విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే టీటీడీలో వివిధ విభాగాలలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులైన 1400 మందిని తొలగించడానికి టీటీడీ బోర్డు సిద్ధమైంది.ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో దాని మీద వెంటనే స్పందించారు.
టీటీడీ లో పని చేస్తున్న 1400 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయం.వారి పొట్టకొట్టొద్దు.కరోనా తో అల్పాదాయ వర్గాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం సరికాదు అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలి అని స్వయంగా ప్రధాని ప్రకటించారన్నారు.అయినా టీటీడీ పెద్దలు ఒక్క కలం వారిని తొలగించడం సహేతుకం కాదన్నారు.
టీటీడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.వారందరినీ కొనసాగించాలి అని పవన్ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ బోర్డు, ఈఓకు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
దీనిపై టీటీడీ బోర్డు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.