ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని మహాభారతంలో( Mahabharatam ) ముందే వెల్లడించారు.అందుకే కొన్ని సందర్భాలలో మహాభారతాన్ని ఆదర్శంగా కూడా తీసుకుంటారు.
ఒక మనిషికి ఏదో ఒక విషయంలో మహాభారతంలో జరిగిన విషయాలు తరస పడుతూ ఉంటాయి.ఇందులో కుళ్ళు కుతంత్రాలు, నీతి, ధర్మం ఇలా అన్ని రకాల గుణాలు కనిపిస్తూ ఉంటాయి.
వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ద్రౌపది ఐదుగురు భర్తలతో కలిసి ఉండడం.ద్రౌపది( Draupadi ) ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు కన్యగా మారేదని పురాణాలు చెబుతున్నాయి.
అందుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వయంవరంలో భాగంగా అర్జునుడు( Arjunudu ) ద్రౌపదిని గెలుస్తాడు.దీంతో ఆమెను తీసుకునే ఇంటికి వెళ్తాడు.తను గెలిచిన బహుమతిని చూడాలని కుంతిని కొడతాడు.
దీంతో అర్జునుడు తీసుకొచ్చింది తన భార్య అని చూడకుండానే పరధ్యానంలో ఐదుగురిని ద్రౌపదినీ పంచుకోమని చెబుతుంది.తల్లి మాటను కాదనలేక ఐదుగురు పంచుకుంటారు.
అయితే ద్రౌపదినీ ఐదుగురిని పంచుకునే క్రమంలో ఏ భర్త వద్ద గొడవ లేకుండా చూసుకుంటుంది.అంతేకాకుండా ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు కొన్ని నియమాలను పాటించేది.
ఒక నెలపాటు ఒకరి దగ్గర ఉండి మరో నెలలో మరో భర్త వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో ఒక భర్త వద్ద నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు ద్రౌపది కన్యగా మారేదని పురాణాలు చెబుతున్నాయి.ద్రౌపది అందరిలాగా కడుపులో నుంచి జన్మించలేదు.యుక్త వయసులో ఉన్న కన్యగా అగ్ని నుంచి పుట్టింది.
అందుకే ఆమెను యజ్ఞసేని( Yajnaseni ) అని కూడా పిలుస్తారు.ఈ క్రమంలో ద్రౌపది ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు అగ్నిలో నడిచేది.
దీంతో ఆమె కన్యగా మారిపోయేదని పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా ఐదుగురు అన్నదమ్ముల మధ్య మరో నియమం ఉండేది.
ద్రౌపతి ఎవరి దగ్గరనైనా ఉన్నప్పుడు వారి వద్దకు ఇంకొకరు వెళ్ళకూడదు.కానీ ఒకసారి పశువుల కాపరి వచ్చి తన పశువులను దొంగలించాడని, కాపాడమని అర్జునుడిని కోరారు.
దీంతో అర్జునుడు నియమం తప్పి ధర్మరాజు వద్దకు విల్లు కోసం వెళతాడు.ఆ సమయంలో ద్రౌపది అక్కడే ఉంటుంది.
దీంతో విల్లును తీసుకొని పశువులను రక్షిస్తాడు.కానీ ఆ తర్వాత నియమం ప్రకారం అర్జునుడు అరణ్యవాసం చేస్తాడు.