తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ కు( Congress ) కేసిఆర్ తో ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.తెలంగాణలో మొదటిసారి బిఆర్‌ఎస్ యేతర ప్రభుత్వం ఏర్పాటు అవుతుండడంతో.
కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతుంది ? ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చుతుంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.ఇదే సమయంలో కాంగ్రెస్ ఐదు సంవత్సరాలు పరిపాలించగలదా ? లేదా మద్యలోనే కూలిపోయే అవకాశం ఉందా ? అనే ప్రశ్నలు కూడా వ్యక్తమౌతున్నాయి.దీనికి కారణం ఇటీవల బిఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి( Kadiyam Srihari ) చేసిన వ్యాఖ్యాలే.కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపు కూలిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో బిఆర్‌ఎస్( BRS ) కోవర్ట్ లు ఉన్నారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.బిఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓటు షేర్ తో ఓటమి చవి చూసింది.హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న బిఆర్‌ఎస్ కల నెరవేరలేదు.దాంతో కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ వైపు తిప్పుకునే వ్యూహాలకు కేసిఆర్ పదును పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం 39 ఎమ్మేల్యేలు ఉన్న బిఆర్‌ఎస్ కు అధికారం చేజిక్కించుకోవాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరత ఉంది.

అయితే 7 సీట్లు సాధించిన మజ్లిస్ మద్దతు ఎలాగూ వుంది.ఇక మిగ్లిన 14 మంది ఎమ్మెల్యేలను రాబట్టుకుంటే కాంగ్రెస్ ను కూల్చడం పెద్ద విషయమేమి కాదనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. కడియం శ్రీహరి ( Kadiyam Srihari )చేసిన వ్యాఖ్యలతో కేసిఆర్ అదే ప్లాన్ లోనే ఉన్నారా ? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.దీంతో అసలే అంతర్గత కుమ్ములాటలతో సతమతమయ్యే హస్తంపార్టీ.ఎమ్మెల్యేలను జారవిడిస్తే అధికారం బిఆర్‌ఎస్ వైపు వెళ్ళడం ఖాయమనేది కొందరి అభిప్రాయం.మొత్తానికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు దాన్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి.అయితే తాము ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే కేసిఆర్( KCR ) తేల్చి చెప్పారు.
మరి ఆయన కాంగ్రెస్ ను కూల్చే ప్రయత్నం చేస్తారా ? లేదా ప్రతిపక్షానికే పరిమితం అవుతారా ? అనేది చూడాలి.