నాగచైతన్య నాని కాంబోలో మిస్ అయిన బ్లాక్ బాస్టర్.... ఏంటో తెలుసా!

అక్కినేని నాగచైతన్య ( Nagachaitanya )ప్రస్తుతం తండేల్ ( Thandel )సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Nagachaitanya And Nani Combo Missed Movie Details Here, Nagachaitanya,nani, Mult-TeluguStop.com

నాగచైతన్య సినీ కెరియర్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది.ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

Telugu Multier, Nagachaitanya, Nani, Tadakha-Movie

ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్యకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.టైర్ 2 హీరోల విషయానికి వస్తే నాని( Nani ) ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్నారని చెప్పాలి.ప్రస్తుతం ఈయన సినిమాలకు నిర్మాతగాను హీరోగాను కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక నానికి ఓవర్సీస్ లో కూడా స్టార్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉందని చెప్పాలి.

ఇక త్వరలోనే నాని హిట్ 3( Hit 3 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

Telugu Multier, Nagachaitanya, Nani, Tadakha-Movie

తాజాగా నాని నాగచైతన్యకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉండేదట.కొన్ని కారణాలవల్ల ఆ సినిమా మిస్ అయిందని తెలుస్తుంది.మరి వీరిద్దరి కాంబోలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రం మరి ఏదో కాదు తడాఖా ( Thadakhaa )అని తెలుస్తుంది.

ఈ సినిమాలో సునీల్( Sunil ) పాత్రలో ముందుగా నానిని తీసుకోవాలని అనుకున్నారట అయితే ఆ సమయంలో నాని డేట్స్ ఖాళీగా లేకపోవడంతో డైరెక్టర్ డాలీ సునీల్ ఎంపిక చేశారు ఇకపోతే ఈ చిత్రం నాని చైతన్య కాంబోలో రావాల్సి ఉండేదని తెలుస్తోంది.అలా వీరిద్దరి కాంబోలో ఒక సూపర్ హిట్ సినిమా మిస్ అయింది అయితే భవిష్యత్తులో అయినా వీరిద్దరూ కలిసి నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube