ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది.అయితే ఈ కొత్త టెక్నాలజీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని దుష్ప్రభావాలు కూడా తక్కువకావు.
ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, సైబర్ అటాక్స్, ఆటోమేషన్ వల్ల ఉద్యోగ నష్టం వంటి సమస్యలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.ఇటీవలి కాలంలో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతోంది.
ఇవి మానవులను అనుకరించేలా రూపొందించబడి ఉంటాయి.పనుల్లో మానవులను భర్తీ చేయడమే కాకుండా, వారితో సమానంగా లేదా ఎక్కువగా పని చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
అయితే, ఇటీవలి కాలంలో చైనాలో జరిగిన ఓ సంఘటన హ్యూమనాయిడ్ రోబోల ( Humanoid robots )భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
చైనాలో( China ) ఇటీవల నిర్వహించిన ఓ ఈవెంట్‌లో హ్యూమనాయిడ్ రోబోలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
వీటిని వివిధ కార్యక్రమాల కోసం ఉపయోగించారు.అయితే అనుకోకుండా ఓ రోబోట్ అసహజ ప్రవర్తన చూపించి ప్రజలపై దాడికి దిగింది.
అక్కడి జనాలను అర్థం కాని భయాందోళనకు గురిచేసింది.భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి రోబోట్‌ను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటన అక్కడ ఉన్న వారిని తీవ్రంగా భయపెట్టింది.
ఈ సంఘటన చూసినవారికి రజనీకాంత్ నటించిన “రోబో” సినిమా గుర్తుకు వచ్చింది.ఆ సినిమాలో చిట్టి అనే రోబోట్ మనుషులపై ఎలా దాడి చేస్తుందో, అచ్చం అలాగే ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ప్రవర్తించింది.వీడియోలో, రోబోట్ జనాల వైపు ముందుకు వెళ్లి, వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది.
అంతే కాకుండా, మరో హ్యూమనాయిడ్ రోబోట్ పూర్తిగా ప్రశాంతంగా ఉండటంతో, ఈ ప్రవర్తన రోబోట్ సాఫ్ట్‌వేర్‌లో లోపం వల్ల జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ సంఘటన తర్వాత హ్యూమనాయిడ్ రోబోలు భద్రత గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.
రోబోట్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతుండగా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరింత తీవ్రమవుతాయా? అనే ప్రశ్నలతో నెటిజన్లు, శాస్త్రవేత్తలు చర్చిస్తున్నారు.మానవ జాతికి ముప్పుగా మారే ప్రమాదం ఉందా? అనే సందేహాలు పెరుగుతున్నాయి.
AI ఆధారిత రోబోలు మానవ జీవితాన్ని సులభతరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.కానీ అవి నియంత్రణలో లేకపోతే పెద్ద విపత్తుగా మారవచ్చు.ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోలు ఆరోగ్యరంగం, పరిశ్రమలు, సేవల రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.కానీ వాటి సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, అవి అనుకోకుండా పనిచేయడం వంటి సమస్యలు మానవ సమాజానికి సవాలుగా మారుతున్నాయి.
AI, రోబోటిక్స్ అభివృద్ధి మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో? మానవ జీవితాన్ని మెరుగుపరిచే దిశగా ఉపయోగపడతాయా, లేక ముప్పుగా మారతాయా? అనే ప్రశ్నలకు సమాధానం సమయం చెప్పాలి!
.