మీ జుట్టు మూడింతలు అవ్వాలా.. అయితే ఈ హెయిర్ మాస్క్ ను అస్సలు మిస్ అవ్వకండి!!

సాధారణంగా కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.ఆడవారిలోనే కాదు మగవారిలో సైతం ఈ సమస్య కనిపిస్తుంటుంది.

 Try This Simple Mask For Triple Hair Growth! Triple Hair Growth, Hair Growth Mas-TeluguStop.com

ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పోషకాలు కొరత, పెరిగిన కాలుష్యం, ధూమ‌పానం తదితర కారణాల వల్ల జుట్టు అధికంగా రాలిపోయి రోజు రోజుకు పల్చబడుతుంటుంది.ఈ సమస్యకు చెక్ పెట్టి మీ జుట్టును మూడింతలుగా మార్చుకోవాలని భావిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్( Hair mask ) ను అస్సలు మిస్ అవ్వకండి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు పొందుతారు.

అందుకోసం ముందుగా బాగా పండిన ఒక అరటి పండును( Banana fruit ) తీసుకొని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం,( castor oil ) వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరియు రెండు టేబుల్ స్పూన్లు గ‌డ్డ పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ మాస్క్ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో కొత్త జుట్టు రావడం ప్రారంభమవుతుంది.మీ పల్చటి జుట్టు క్రమక్రమంగా ఒత్తుగా తయారవుతుంది.అలాగే అరటిపండు, దాల్చిన చెక్క, కొబ్బరి నూనె, ఆముదం మరియు పెరుగులో ఉండే పోషకాలు జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తాయి.జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

కురులు స్మూత్ గా షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube