తేన్పులు( Burping ).చాలా చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తాయి.
ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు పదే పదే తేన్పులు వస్తుంటే బాగా ఇబ్బంది పడుతుంటారు.అధికంగా తినడం లేదా తొందరగా తినడం, త్వరగా జీర్ణంకాని ఆహారం తీసుకోవడం, స్మోకింగ్, బీర్, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ లేదా షాంపైన్ వంటి కార్బోనేటేడ్ పానీయాలు సేవించడం తదితర కారణాల వల్ల కొందరికి పదే పదే తేన్పులు వస్తుంటాయి.తేన్పులు వల్ల
అల్లం, నిమ్మరసం ( Ginger lemon juice )కాంబినేషన్ తేన్పులను చాలా వేగంగా తగ్గిస్తాయి.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం రసం, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవాలి.ఇలా చేస్తే తేన్పులు రావడం దెబ్బకు కంట్రోల్ అవుతాయి.
అలాగే బొప్పాయి పండు తేన్పులకు చెక్ పెట్టడంలో గ్రేట్ గా సహాయపడతాయి.పదే పదే తేన్పులు వస్తున్నప్పుడు కొన్ని బొప్పాయి పండు ముక్కలు( Papaya slices ) తింటే.అందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ సంబంధిత సమస్యలన్నిటినీ క్షణాల్లో దూరం చేస్తుంది.
పుల్లటి తేన్పులు, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను నివారించడంలో సోంపు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది.వన్ టేబుల్ స్పూన్ సోంపును స్లైట్ గా దంచి ఒక గ్లాస్ వాటర్ లో పది నిమిషాల పాటు మరిగించి తీసుకోవాలి.
ఇలా చేస్తే తేన్పుల సమస్య పరార్ అవుతుంది.లేదా ఒక గ్లాస్ వాటర్ లో కొద్దిగా ఇంగువ కలిపి తీసుకున్నా కూడా తేన్పులు రావడం ఆగుతాయి.