ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా( Maha Kumbh Mela ) ఘనంగా ముగిసింది.ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహోత్సవం, హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు.
గంగా, యమునా, సరస్వతి నదుల సంగమస్థలమైన ప్రయాగ్‌రాజ్ ( Prayagraj )లో ఈ వేడుక 45 రోజుల పాటు కన్నుల పండువగా జరిగింది.ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈ ఏడాది కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగిసింది.అయితే ఈ వేడుకలో కొన్ని విశేష ఘటనలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు ఆ వైరల్ విశేషాలను తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సమీప గ్రామం నుంచి కుంభమేళాకు పూసలు అమ్మడానికి వచ్చిన మోనాలిసా( Mona Lisa ), ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారింది.
ఆమె యొక్క తేనె కన్నులు, చిరునవ్వు నెటిజన్లను ఆకర్షించాయి.భక్తులు ఆమెతో ఫొటోలు, రీల్స్ చేయడంతో మోనాలిసా ఓ నేషనల్ సెలబ్రిటీ అయింది.దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ప్రస్తుతం ఆమె “ది డైరీ ఆఫ్ మణిపూర్” ( The Diary of Manipur )చిత్రంలో నటిస్తోంది.
అలాగే ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ( Aerospace Engineering at IIT Bombay )పూర్తి చేసిన అభయ్ సింగ్( Abhay Singh ), సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు.ఈ వార్త కుంభమేళా ప్రారంభంలోనే వైరల్ అయింది.

ఒక మహిళ కుంభమేళాలో త్రివేణి సంగమంలో నిలబడి తన భర్తకు వీడియో కాల్ చేసింది.అనంతరం తన ఫోన్‌ను కూడా పవిత్ర నదిలో ముంచి స్నానం చేయించింది.ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.కుంభమేళాలో ఓ వ్యక్తి హాలీవుడ్ నటుడు హ్యారీ పోర్టర్ ( Harry Porter )లా కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
అతని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక మాజీ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి, కుంభమేళా సందర్భంగా సన్యాసం స్వీకరించింది.ఆమెకు “మాయీ మమతా నంద్ గిరి” అని నామకరణం చేశారు.అయితే కొన్ని కారణాల వల్ల కిన్నెర అఖాడా నుండి ఆమెను బహిష్కరించారు.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త “డిజిటల్ స్నాన్” అనే వినూత్న ఆలోచన తెచ్చాడు.కుంభమేళాకు రాలేని భక్తులు తమ ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపితే, వాటిని ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో ముంచి వీడియో పంపించే విధంగా సేవ అందించాడు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి, తన 92 ఏళ్ల తల్లిని కుంభమేళాకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో ఎద్దుల బండిపై కుంభమేళాకు తీసుకెళ్లాడు.
ఈ ఘటన నెటిజన్ల మనసులను కదిలించింది.ఈ సంవత్సరం మహా కుంభమేళా భక్తి, ఆధ్యాత్మికతతో పాటు అనేక ఆసక్తికర ఘటనలకు వేదికైంది.
కుంభమేళాలో జరిగిన ఈ వైరల్ ఘటనలు ఆకర్షించాయి.ఆధ్యాత్మిక మహోత్సవం మాత్రమే కాకుండా, సమాజంలో విశేష చర్చనీయాంశంగా మారిన మహా కుంభమేళా, మరోసారి భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.







