పచ్చగా మారిన దంతాలను తెల్లగా మార్చుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇప్పుడు చెపుతున్న చిట్కాను ఫాలో అయితే పళ్లకు పట్టిన గార,పసుపు రంగు ఇట్టే వదిలిపోతాయి.
మగవారైనా,ఆడవారైనా పళ్ళు తెల్లగా ఉండాలని కోరుకుంటారు.మనం మాట్లాడినప్పుడు పళ్ళు తెల్లగా ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటాం.
అందువల్ల పళ్ళను తెల్లగా మార్చే చిట్కా గురించి తెలుసుకుందాం.
ఈ చిట్కాకు కావలసినవి కేవలం రెండే రెండు పదార్ధాలు.
ఒకటి కొబ్బరి నూనె, రెండోవది బేకింగ్ సోడా
బేకింగ్ సోడాలో కాలిష్యం,కార్బనేట్ ఉండుట వలన దంతాలకు పట్టిన గారను,పసుపును వదిలించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.కొంత మంది బేకింగ్ సోడాను పళ్లకు వాడటానికి కొంచెం భయపడుతూ ఉంటారు.
కానీ దేనినైనా లిమిట్ గా వాడితే ఎటువంటి ఇబ్బందులు,సైడ్ ఎఫెక్ట్స్ రావు.అయితే పది రోజులకు ఒకసారి బేకింగ్ సోడాను వాడవచ్చు.
ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
కొబ్బరి నూనె పంటితో ఉన్న బ్యాక్టీరియాను తొలగించి పళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది.అంతేకాక పంటిపై ఉన్న పసుపు రంగును కూడా చాలా సమర్ధవంతంగా తొలగిస్తుంది.
ఈ చిట్కాను ఎలా చేయాలో తెలుసుకుందాం.
మూడు స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని టూట్ బ్రష్ సాయంతో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు తోమాలి.ఆ తర్వాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేసిన మొదటి సారే దంతాల గార,పసుపు రంగు తొలగిపోతుంది.
చూసారుగా ఫ్రెండ్స్ ఈ చిన్ని చిట్కాను పాటించి మీ దంతాలను అందంగా,తెల్లగా ఆకర్షణీయంగా మార్చుకోండి.