మనం రాశుల బట్టి మన జాతకం ఎలా ఉందొ తెలుసుకుంటాం.మన జాతకం గ్రహ స్థితులను బట్టి మారుతూ ఉంటుంది.
మన రాశిని బట్టి ఎదుటి వారిని ఎలా ప్రపోజ్ చేసి పడగొట్టవచ్చో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.ఇప్పుడు ఏ రాశి వారు ఎలా ప్రపోజ్ చేయాలో తెలుసుకుందాం.
మేష రాశిఈ రాశి వారికి ప్రపోజ్ చేయాలంటే కాస్త కష్టమైన పనే.వీరు చాలా స్వతంత్రంగా ఉంటారు.వీరు చేసే పనిలో కిక్ కోరుకుంటారు.అందువల్ల వీరి కోసం కాస్త ఖర్చు పెట్టి ట్రెక్కింగ్, బంగీ జంప్, హైకింగ్ వంటి వాటి కోసం బయటకు ట్రిప్ వేయాలి.
వృషభ రాశిఈ రాశి వారికి ప్రపోజ్ చేయాలంటే పెద్దగా కష్టపడవలసి అవసరం లేదు.కళ్ళలో నిజాయితీ,గుండెల్లో ప్రేమ ఉంటె చాలు.
పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేదు.ఒక గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన సరిపోతుంది.
మిధున రాశిఈ రాశి వారికి ప్రపోజ్ చేయాలంటే కాస్త హోమ్ వర్క్ చేయవలసిందే.వీరి ఆలోచనలు విభిన్నంగా ఉండుట వలన అంచనా వేయటం కొంచెం కష్టమైన పని.వీరితో పరిచయం బాగా పెంచుకొని వారిని బాగా చేసుకుంటేనే ముందడగు వేయగలరు.
కర్కాటక రాశిఈ రాశి వారు కాస్త బిడియంగా ఉంటారు.
వీరు ఎవరితో మాట్లాడితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని కంగారు పడుతూ ఉంటారు.వీరితో కంగారు పడకుండా కాస్త సమయాన్ని ఇచ్చి ఆ తర్వాత మాత్రమే ప్రపోజ్ చేయాలి.
సింహా రాశిఈ రాశి వారు చాలా ఛాలెంజ్ తో కూడి ఉంటారు.ఏ పని చేసిన ఛాలెంజ్ గా తీసుకోని మరీ చేస్తారు.వీరికి ప్రపోజ్ చేసినప్పుడు వారు థ్రిల్ అయ్యే విధంగా ఉండాలి .
కన్య రాశిఈ రాశి వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు.వీరికి ప్రపోజ్ చేయటం కొంచెం సులభమే.వీరు ప్రతి విషయాన్నీ గమనిస్తారు.కాబట్టి ఓవర్ చేయకుండా సింపుల్ గా ప్రపోజ్ చేయాలి.
తుల రాశిఈ రాశి వారు చాలా తెలివిగా ఆలోచిస్తారు.
ఏ విషయంలోనైనా ఆచి తూచి అడుగు వేస్తారు.ఎటువంటి హంగామా లేకుండా సింపుల్ గా ప్రపోజ్ చేయాలి.
కాస్త ఓవర్ యాక్షన్ చేస్తే నష్టపోతారు.
వృశ్చిక రాశిఈ రాశి వారు మాట్లాడితే మాట్లాడతారు.అంతేకాని కల్పించుకొని మాట్లాడరు.వారి మనస్సు ఏమిటనేది తొందరగా బయట పెట్టరు.
వీరి ప్రేమ కోసం వెయిట్ చేయాలి.తొందర పడితే అసలుకే మోసం వస్తుంది.
కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశిఈ రాశి వారు చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు.
నచ్చని విషయాలను ఏ మాత్రం సంకోచం లేకుండా ముఖాన్నే చెప్పేస్తారు.వీరిని జాగ్రత్తగా డీల్ చేయాలి.
రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా అలోచించి ప్రపోజ్ చేయాలి.
మకర రాశిఈ రాశి వారి తలితండ్రులను ఇంప్రెస్ చేస్తే వీరు కూడా ఇంప్రెస్ అయ్యిపోతారు.
వీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.అందువల్ల వీరు పెళ్లి విషయం కూడా పెద్దవారికే వదిలేస్తారు.
అందుకే పెద్దవారి వైపు నుండి వ్యవహారం నడపాలి.
కుంభ రాశిఈ రాశి వారికి ప్రేమిస్తున్న విషయాన్నీ మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి.
వీరికి ప్రేమను ప్రపోజ్ చేయాలంటే వంద మందిలో ధైర్యంగా చెప్పితే బాగా ఇంప్రెస్ అవుతారు.
మీన రాశిఈ రాశి వారికి కాస్త ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.
మీ మనస్సులోని మాటను కాస్త నిదానంగా చెప్పాలి.వీరు బాధ వచ్చిన ఆనందం వచ్చిన అసలు తట్టుకోలేరు.
అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.