ఇటీవల కాలంలో చాలా మంది డైట్ పేరుతో అన్నం తినడం మానేస్తున్నారు.అన్నంలో కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి.ఈ కారణంగానే రైస్ కు బదులుగా ఇతర ఆహారాలను ఎంచుకుంటున్నారు.
మీరు కూడా ఒక్కసారిగా అన్నం తినడం మానేస్తున్నారా.? అయితే మీరు కచ్చితంగా పొరపాటే చేస్తున్నారు.నిజానికి అన్నం వల్ల నష్టాలే కాదు లాభాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా పాలిష్ చేయని బియ్యం లేదా తక్కువ పాలిష్ చేసిన బియ్యంతో అన్నం వండుకుని మితంగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు.రైస్ లో ఫైబర్ కంటెంట్( Fiber content ) ఉంటుంది.అందువల్ల రైస్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.రైస్ లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
అవి కణాలకు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.అలాగే రైస్ లో ఉండే బి విటమిన్లు మన నాడీ వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.
శరీరానికి ప్రధాన ఇంధన వనరు అయిన కార్బోహైడ్రేట్లకు రైస్ గొప్ప మూలం.కార్బోహైడ్రేట్లు( Carbohydrates ) మిమ్మల్ని శక్తివంతంగా మరియు సంతృప్తిగా ఉంచగలవు.
రైస్ ను తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి తలెత్తకుండా ఉంటాయి.అలాగే అన్ని కూరగాయ ముక్కలతో కలిపి రైస్ ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా ఉంటాయి.

అందువల్ల ఒక్కసారిగా అన్నం తినడం మానేస్తే ఈ ప్రయోజనాలన్నిటినీ కోల్పోతారు.అందుకే కనీసం ఒక పూట అయినా అన్నం తినాలని నిపుణులు చెబుతున్నారు.ఒకవేళ మీకు వైట్ రైస్ ఇష్టం లేకపోతే బ్రౌన్ రైస్ ను ఎంపిక చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్( Brown Rice ) లో ఫైబర్, మాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం మరియు విటమిన్లతో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.
పైగా బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు.