అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో( Road Accident ) తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న భారతీయ విద్యార్ధిని నీలం షిండే( Neelam Shinde ) కుటుంబానికి ఊరట లభించింది.నీలంను పరామర్శించేందుకు ఆమె తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరైంది.
ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వారికి వీసాను మంజూరు చేసింది.ఈ కుటుంబానికి వీసా( Visa ) ఇంటర్వ్యూ కోసం భారత విదేశాంగ శాఖ.అమెరికా రాయబార కార్యాలయం దృష్టికి తీసుకురాగా యూఎస్ ఎంబసీ( US Embassy ) సానుకూలంగా స్పందించింది.నీలం తండ్రికి ఫిబ్రవరి 28న ఉదయం 9 గంటలకు వీసా ఇంటర్వ్యూను ఏర్పాటు చేసింది.

ఫిబ్రవరి 16న తన కుమార్తెకు ప్రమాదం గురించి తెలిసినప్పటి నుంచి నీలం తండ్రి తనాజీ షిండే( Tanaji Shinde ) అమెరికా వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.సమస్య పరిష్కారం కోసం షిండే కుటుంబం కేంద్రం సహాయం కోరింది.అమెరికాలోని నీలం మిత్రులు, పలువురు ప్రవాస భారతీయులు ఈ విషయాన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ఆగమేఘాల మీద స్పందించారు.నీలం షిండే కుటుంబానికి వీసా మంజూరు చేయాలని వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు( MEA S Jaishankar ) సుప్రియ విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరి 14న అమెరికాలోని కాలిఫోర్నియాలో( California ) జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీలం కోమాలోకి వెళ్లిపోయారు.ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.నాలుగు చక్రాల వాహనం ఢీకొట్టడంతో ఆమెకు తల, ఛాతీలో తీవ్రగాయాలు అయ్యాయి.ఫిబ్రవరి 16న ప్రమాదం గురించి నీలం తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.ప్రమాదం జరగడానికి రెండ్రోజుల ముందు చివరిసారిగా నీలం తన తండ్రి, సోదరుడితో ఫిబ్రవరి 12న మాట్లాడారు.
ప్రమాదం గురించి ఆసుపత్రి అధికారులు, నీలం రూమ్‌మేట్స్ ద్వారా ఆమె కుటుంబానికి సమాచారం అందించామని నీలం బంధువు సంజయ్ కదమ్ తెలిపారు.
నీలం బ్రెయిన్‌కు ఆపరేషన్ చేసేందుకు గాను ఆసుపత్రి అధికారులు మా అనుమతి తీసుకున్నారని.ప్రస్తుతం ఆమె కోమాలో ఉందని సంజయ్ చెప్పారు.