ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇదిలా ఉంటే కొంతమంది దర్శకులు సైతం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇప్పుడు మంచి సినిమాలను చేస్తూ పాన్ ఇండియా ఇండస్ట్రీలో కూడా వాళ్ళ సత్తాను చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి.ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ సినిమాతో వెంకటేష్ 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు.ఇక మీదట వెంకటేష్ చేయబోయే సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలనే ఒక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక వెంకటేష్( Venkatesh ) సినిమాను గనక పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే ఆయనకు మంచి ఆదరణ దక్కుతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఆదరిస్తున్న క్రమంలో వెంకటేష్ సినిమాలకు కూడా అక్కడ మంచి గిరాకీ పెరిగే అవకాశాలైతే ఉన్నట్టుగా కొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు.ఇక మీదట చేయబోయే సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ చేసి భారీ వసూళ్లను రాబట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.మొన్నటిదాకా వెంకటేష్ కి 80 కోట్ల బడ్జెట్ పెట్టడానికే ఎవరు ముందుకు రాలేదు.
కానీ సంక్రాంతి కి వస్తున్నాం సినిమా 300 కోట్ల కలెక్షన్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో ఇప్పుడు ఆయన మీద దాదాపు 50 కోట్ల బడ్జెట్ ని కూడా పెట్టడానికి యావత్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్లందరు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
.