ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఉన్న హీరోలు భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టారనే చెప్పాలి.
మన తెలుగు హీరోలు తాకిడిని తట్టుకోలేక బాలీవుడ్ స్టార్ హీరోలు ( Bollywood star heroes )అందరూ చేతులెత్తేస్తున్నారు.వాళ్లకు ఏ సినిమా చేస్తే మంచి విజయం దక్కుతుందో క్లారిటీ లేకుండా పోయింది.

ఇక మనవాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండడం కూడా వాళ్లకు చాలా వరకు మైనస్ గా మారుతుంది.ఒక రకంగా చెప్పాలంటే మన సినిమాలను మించి వాళ్ళ సినిమాలు రావడం లేదు.కాబట్టి అక్కడి ప్రేక్షకులు సైతం మన సినిమాలకు పట్టం కడుతున్నారు.మరి ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
రీసెంట్ గా విక్కీ కౌశల్ ( Vicky Kaushal )హీరోగా వచ్చిన ఛావా సినిమా( Chava movie ) వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి బాలీవుడ్ కి కొంతవరకు ఊపిరి పోసిందనే చెప్పాలి.

మరి మొత్తానికైతే శంభాజీ మహారాజు( Shambhaji Maharaja ) జీవిత కథ ఆధారంతో వచ్చిన ఈ సినిమాను చూడటానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.దాంతో ఈ సినిమాను తెలుగులో డబ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఒకవేళ ఈ సినిమా తెలుగులో కనక రిలీజ్ అయితే ఈ కలెక్షన్స్ మరింత తారా స్థాయికి చేరుకునే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పటికే తెలుగులో ఈ సినిమాను చూడడానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు.మరి మార్చి 7 వ తేదీన ఈ సినిమా తెలుగులోకి డబ్ అవ్వబోతుంది.కాబట్టి ఇప్పటినుంచి ఈ సినిమా లెక్కలు మరింత మారిపోయే అవకాశాలైతే ఉన్నాయి.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా దాదాపు 700 నుంచి 800 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది…
.