జుట్టు రాలడం, చుండ్రు( Dandruff ).స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా అత్యధిక మందిని వేధించే కామన్ సమస్యల్లో ఇవి రెండు ముందు వరుసలో ఉంటాయి.
ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, చుండ్రు సమస్యను నివారించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఈ రెండు సమస్యలకు ఒకే రెమెడీతో చెక్ పెట్టవచ్చు.
మరి ఆ రెమెడీ ఏంటి అనేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ డ్రై ఆమ్లా, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసుకుని ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు, ఉసిరికాయ ముక్కలు, కలోంజి సీడ్స్ ను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు మందారం ఆకులను తుంచి వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకే ఒక్కసారి ఈ రెమెడీని పాటించారు అంటే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే కేవలం రెండు మూడు వాషుల్లోనే మాయం అవుతుంది.స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.హెల్తీ గా మారుతుంది.
అలాగే ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్య( Hair Fall Problem ) దెబ్బకు కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
నెల రోజుల్లోనే మీ జుట్టు రెట్టింపు అవుతుంది.కాబట్టి చుండ్రు, హెయిర్ ఫాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.







