న్యాచురల్ స్టార్ నాని( Nani ) మొదటి నుండి ఏడాదికి మూడు సినిమాలు ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు.మరి ఈ సంఖ్య ఈ మధ్య బాగా తగ్గించాడు.
దసరా సినిమా తర్వాత ఆచి తూచి కథలను ఎంచుకుంటూ తన స్థాయి పడిపోకుండా చూసుకుంటున్నాడు.నాని కెరీర్ లోనే ‘దసరా’ సినిమా ( Dasara Movie )బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
అంతేకాదు ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత వెంటనే నాని మరో మూవీ స్టార్ట్ చేసి పూర్తి కూడా చేస్తున్నాడు.
నాని కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ ను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తో చేస్తున్నాడు.ఇది కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కుతుంది.

ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘హాయ్ నాన్న‘ ( Hi Nanna )అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.నాని ఇప్పటి వరకు కనిపించని పూర్తి విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు అని ఇది పూర్తి సెంటిమెంట్ మూవీ అని తెలుస్తుంది.
ఈ సినిమాతో ఈ ఏడాది డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత నాని చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది.నాని తన నెక్స్ట్ 31వ సినిమాను వివేక్ ఆత్రేయతో చేయనున్న విషయం విదితమే.ఇప్పటికే వీరి కాంబోలో అంటే సుందరానికి సినిమా వచ్చింది.
ఇక ఇప్పుడు రెండవసారి తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక యంగ్ బ్యూటీ ఫిక్స్ అయినట్టు టాక్.ఆమె ఎవరు అంటే తమిళ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరైన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాకు లాక్ అయినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ జోడీ కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో( Gang Leader ) నటించారు.ఈ సినిమాతో హిట్ పెయిర్ అని అనిపించుకున్నారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎలా ఉంటుందో ఎప్పుడు అఫిషియల్ గా ప్రకటిస్తారో చూడాలి.







