తమ ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.అందులోనూ దగ్గర్లో ఏదైనా పెళ్లికి వెళ్లాల్సి ఉన్నా, ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉన్నా.
ముఖ చర్మంపై మరింత శ్రద్ధ పెడుతుంటారు. స్కిన్‌ను వైట్‌గా, బ్రైట్‌గా మార్చుకోవడం కోసం మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములు, మాస్క్‌లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదు గానీ.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ నైట్ క్రీమ్‌ను యూస్ చేస్తే మాత్రం వారం రోజుల్లో ముఖం వైట్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ నైట్ క్రీమ్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక ఆరెంజ్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగాలి.
ఇలా కడిగిన ఆరెంజ్‌ను పై తొక్క మాత్రం సపరేట్ అయ్యేలా తురుముకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలోవెర జెల్, తురుమి పెట్టుకున్న ఆరెంజ్ పీల్ వేసుకుని బాగా కలిపి రెండు గంటల పాటు వదిలేయాలి.
రెండు గంటల అనంతరం ఈ మిశ్రమం నుండి స్ట్రైనర్ సాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పూర్తిగా నీరు తొలగించి పెరుగును మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.
అలాగే అందులో మూడు టేబుల్ స్పూన్లు సపరేట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటే హోమ్ మేడ్ నైట్ క్రీమ్ సిద్ధమైనట్లే.ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.

నైట్ నిద్రించే ముందు ముఖాన్ని శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న నైట్ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.ఇలా ప్రతి రోజు గనుక చేస్తే ముఖ చర్మం వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.మరియు చర్మం మృదువగా కూడా తయారవుతుంది.







