పండుగ వేళ బ్యాడ్‌న్యూస్ చెప్పిన హీరో కంపెనీ.. టూవీలర్స్ ధర పెంపు..!

హీరో మోటోకార్ప్( Hero MotoCorp ) తన కొన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను అక్టోబర్ 3వ తేదీ నుంచి దాదాపు 1% పెంచుతోంది.కచ్చితమైన ధర పెరుగుదల మోడల్, మార్కెట్‌ను బట్టి మారుతుంది.

 Hero Motocorp To Hike Motorcycle Scooter Prices By 1 Percent From October 3 Deta-TeluguStop.com

బండి ధర ఎక్కువగా ఉంటే అదనంగా ఎక్కువ డబ్బులు చెల్లించుకోక తప్పదు.ద్రవ్యోల్బణం, లాభాల మార్జిన్లు, మార్కెట్ వాటాను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

మార్కెట్‌లో పోటీతత్వం, మంచి స్థానంలో ఉన్నామని నిర్ధారించుకోవడానికి వాహనాలను క్రమం తప్పకుండా కంపెనీని సమీక్షిస్తుంది.తాజాగా ఇందులో భాగంగానే ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.

హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల ధరలను ఈ సంవత్సరం మూడుసార్లు పెంచింది.మార్చి ఒకసారి, జులైలో ఇంకోసారి, ఇప్పుడు అక్టోబర్‌లో మరోసారి పెంచుతూ వినియోగదారులపై అధిక ధరల భారం మోపింది.

కొత్త కార్బన్ ఎమీషన్ కంట్రోల్ వ్యవస్థ అయిన OBD-2కి మారడానికి అయ్యే ఖర్చును భర్తీ చేయడానికి ధర పెంచుతున్నట్లు మార్చిలో వెల్లడించింది.రెండవ, మూడవ ధరల పెంపుదల తన కంపెనీ సాధారణ సమీక్షలో భాగం.

Telugu Bike, Carboncontrol, Harley Davidson, Motocorp, Motorcycles, Karizma Xmr,

హీరో మోటోకార్ప్ వచ్చే ఎనిమిది త్రైమాసికాలలో ఎనిమిది కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది.ఇందులో హార్లే-డేవిడ్‌సన్ X440( Harley-Davidson X440 ) కూడా ఉంది, ఇది సింగిల్-సిలిండర్ హార్లే బైక్, ఇది భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.కరిజ్మా XMR 210( Karizma XMR 210 ) అనేది హీరో మోటోకార్ప్‌కి ఒక ముఖ్యమైన మోటార్‌సైకిల్, ఎందుకంటే ఇందులో కొత్త లిక్విడ్-కూల్డ్ ఇచ్చారు.

Telugu Bike, Carboncontrol, Harley Davidson, Motocorp, Motorcycles, Karizma Xmr,

ఇది 210cc ఇంజన్ తో 25.15 హార్స్‌పవర్, 20.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇది ట్రెల్లిస్ ఫ్రేమ్‌ను కూడా కలిగి ఉంది, ఇది హీరో పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక ఫ్రేమ్ రకం.హీరో మోటోకార్ప్ పెద్ద ఎక్స్‌పల్స్ , ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్లపై కూడా పని చేస్తోంది.ఇవి కొత్త 440cc ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది.రెండు మోటార్‌సైకిళ్ల టెస్ట్ ట్రయల్స్ పబ్లిక్‌గా కనిపించాయి, అయితే అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube