మొటిమల్లేని చర్మాన్ని కోరుకుంటున్నారా.. అయితే ఈ సీరం మీకోసమే!

మొటిమలు.( Acne ) టీనేజ్ నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్య.మొటిమల కారణంగా కొందరు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు.మొటిమలకు చెక్ పెట్టడానికి రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే మొటిమలను అడ్డుకునేందుకు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయాలి.

 Try This Natural Serum For Acne Free Skin Details, Natural Serum, Acne Free Skin-TeluguStop.com

ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, షుగర్, మైదా వంటి వాటిని కంప్లీట్ గా ఎవైడ్ చేయాలి.తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, సీడ్స్, చేపలు, గుడ్లు వంటి ఆహారాలను తీసుకోవాలి.

శరీరానికి సరిపడా నీటిని అందించాలి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడికి దూరంగా ఉండాలి.

Telugu Acne, Acne Skin, Tips, Dry Orange Peel, Fenugreek, Latest, Natural Serum,

ఇక ముఖ్యంగా స్కిన్ కేర్ తప్పక పాటించాలి.మొటిమల్లేని చర్మాన్ని కోరుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ సీరంను రెగ్యులర్ గా వాడితే చాలా ప్రయోజనాలు పొందుతారు.

సీరం తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ మెంతులు,( Fenugreek ) కొన్ని ఫ్రెష్ గులాబీ రేకులు( Rose Petals ) మరియు కొన్ని ఎండిన ఆరెంజ్ పండు తొక్కలు( Dry Orange Peel ) వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ఫిల్టర్ చేసి చల్లార‌బెట్టుకోవాలి.

Telugu Acne, Acne Skin, Tips, Dry Orange Peel, Fenugreek, Latest, Natural Serum,

పూర్తిగా కూల్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది రెడీ అవుతుంది.ఒక బాటిల్ లో ఈ సీరంను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించేముందు ముఖాన్ని వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకుని సీరంను అప్లై చేసుకోవాలి.

నిత్యం ఈ సీరంను కనుక వాడితే ముఖంపై మొండి మొటిమలు సైతం మాయం అవుతాయి.మచ్చలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.కొద్దిరోజుల్లోనే మొటిమలు, మచ్చల్లేని చర్మం మీ సొంతం అవుతుంది.అలాగే ఈ సీరం చర్మాన్ని కోమలంగా మారుస్తుంది.

కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.పైగా ఈ సీరంను వాడటం వల్ల స్కిన్ ఏజింగ్‌ ఆలస్యం అవుతుంది.

ముడతలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య ఛాయలు తొందరగా దరి చేరకుండా సైతం ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube