పురాణాల ప్రకారం అమ్మవారు వెలసిన ఆలయాలలో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది.ఈ విధంగానే అమ్మవారి పీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి అని చెబుతారు.
ఈ ఆలయంలో వెలసిన అమ్మవారు పరమేశ్వరుని వివాహం చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ కన్యగానే ఇక్కడ వెలసి భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఈ విధంగా అమ్మవారు ఈ ప్రాంతంలో కన్యగా ఎందుకు వెలిశారు.
ఇలా కన్యగా ఉండటానికి కారణం ఏమిటి? ఈ ఆలయం ఎక్కడ ఉందో? ఆలయ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం…
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలో నాగర్ కోయిల్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం ఉంది.ఈ ఆలయం మూడు సముద్రాలు కలిసిన సంగమ ప్రదేశంలో ఉండటం ఒక విశేషం.
ఎంతో బహు సుందరంగా, ఉన్న ఈ ఆలయంలో వెలసిన అమ్మవారు వివాహం చేసుకోకుండా కన్యగా వెలసే భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఈ విధంగా కన్య అమ్మవారిని పరశురాముడు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలో అమ్మవారు వివాహం కాకుండా కన్యగా ఉండటం వల్ల ఈ అమ్మవారిని కన్యకా పరమేశ్వరి అని కూడా పిలుస్తారు.
పురాణాల ప్రకారం తన బలంతో ఎంతో గర్వంగా అందరి పై పడి హింసిస్తున్నటువంటి దుష్ట బాణాసురుడిని చంపడం కోసమే పార్వతీదేవి ఈ అవతారమెత్తారు.
ఈ క్రమంలోనే ఈ దుష్ట బాణాసురుడిని అంతం చేసేలోగా వివాహ గడియలు ముగిసిపోయాయి.వివాహ ముహూర్త సమయం దాటిపోవడంతో పరమేశ్వరుడు యోగ సమాధిలోకి వెళ్ళి పోతాడు.ఈ విధంగా యోగ సమాధిలోకి వెళ్ళిన పరమేశ్వరుడు యోగ నిష్ఠలో అలాగే ఉండిపోగా, పార్వతి దేవి కూడా కన్యగా మిగిలిపోయింది.వీరి పెళ్లి కోసం తయారుచేసిన పిండి వంటలు ఇప్పటికీ ఆలయంలో చిన్న చిన్న రాళ్లు, గవ్వలు మాదిరిగా ఏర్పడి ఉన్నాయి.
ఈ విధంగా కన్యగా వెలిసిన ఈ అమ్మవారికి వైశాఖ మాసంలో నవరాత్రి సమయంలో ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు.