జనవరి 6వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరగనుంది.ఈ మేరకు ఓటర్ల జాబితా సవరణను చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.
జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పులతో పాటు చిరునామాల మార్పు వంటి అంశాలకు దరఖాస్తులు స్వీకరించనుంది.2024 జనవరి ఒకటో తేదీలోగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.ఈ మేరకు ఆరో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించడంతో పాటు ఆ రోజు నుంచి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది.ఈ మార్పులను ఫిబ్రవరి రెండో తేదీ వరకు పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఫిబ్రవరి 6 లోగా డాటాబేస్ లో అప్ డేట్ చేసిన తరువాత 8న తుది జాబితా ప్రచురించనున్నారని తెలుస్తోంది.