డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) ప్రీమియర్స్ రోజున హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటనలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు.ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
శుక్రవారం నాడు హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.డిసెంబర్ 4న జరిగిన ప్రీమియర్ షోలో భాగంగా జరిగిన తోపులాటలో రేవతి( Revathi ) అనే మహిళ మృతి చెందింది.
అంతేకాకుండా ఆమె కుమారుడు కూడా ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు.ఈ నేపథ్యంలో పోలీసులు కొందరి పై కేసులు బనాయించారు.
అందులో హీరో అల్లు అర్జున్ పేరును కూడా చేశారు.
ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని అతనిపై కేసు నమోదు చేశారు.ఈ విషయం సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్ సంధ్య ధియేటర్( Sandhya Theatre ) ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్ అందించాడు.కాకపోతే నేడు హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రీమియర్ షో జరిగిన రోజు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా సరైన సెక్యూరిటీ లేకపోవడంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో ఈ తతంగం మొత్తం జరిగింది.చూడాలి మరి ఈ అరెస్టుకు సంబంధించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే మరి.ఈ క్రమంలో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం.ఉన్నపళంగా తమతో రావాలంటే ఎలా?.బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా?.పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం లేదని అల్లు అర్జున్ అన్నారు.
మొత్తానికి చేయని తప్పుకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన పని వస్తుందంటూ అల్లు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.