సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ సక్సెస్ లు ఉన్న హీరోలకు మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఆయన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలతో సన్నిహితంగా ఉంటూనే పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక పుష్ప సినిమాతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకోవడానికి పుష్ప 3 సినిమా చేసినట్టుగా తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో ఎలివేషన్స్, ఎమోషన్స్ ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి.అందువల్లే ఈ సినిమాని ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తున్నారు.ఇక కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమాకి 1000 కోట్లకు పైన కలెక్షన్లు రావడం అనేది మామూలు విషయం కాదు.మరి ఈ సందర్భంగా ఆయన స్టామినా ఏంటో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తెలిసిందనే చెప్పాలి.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తను తర్వాత చేయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.ఇక ఇప్పటికే త్రివిక్రమ్ తో( Trivikram ) సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు…

ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది.ఇక త్రివిక్రమ్ ఈ కథను చాలా స్ట్రాంగ్ గా రాసుకొని ప్రేక్షకుడిని అలరించే విధంగా ముందుకు తీసుకెళ్లనే ఒక ఉద్దేశ్యంతో కూడా ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు… చూడాలి మరి అల్లు అర్జున్ తను అనుకున్నట్టుగా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటాడా లేదా అనేది…
.