పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్.వీటితో చాలా మంది అనేక రకాలుగా వంటలు తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటుంటారు.
ముఖ్యంగా వర్షాకలంలో పుట్టగొడుగులు విరివిరిగా లభిస్తాయి.చూడముచ్చటగా ఉంటే పుట్టగొడుగులతో ఏ వంటకం చేసుకున్నా.
అద్భుతంగానే ఉంటాయి.అయితే పుట్టగొడుగులు తినడమే కాదు.
ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకోవాలి.
వాస్తవానికి పుట్టగొడుగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.
రక్తపోటు సమస్యతో బాధపడేవారు వారానికి ఒకసారి పుట్టగొడుగులు తింటే ఎంతో మంచిది.ఎందుకంటే.
ఇందులో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది.శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ పుట్టుగొడుగులు గ్రేట్‌గా సహాయపడతాయి.
అలాగే సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి.పుట్టగొడుగుల ద్వారా పొందొచ్చు.అందుకే విటమిన్ డి లోపంతో ఇబ్బందిపడే వారు తరచూ పుట్టగొడుగులు తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.అధిక బరువును తగ్గించి.గుండె జబ్బుల నుంచి రక్షించే శక్తి కూడా పుట్టగొడుగులకు ఉంది.
మధుమేహం సమస్యతో బాధపడేవారు కూడా పుట్టగొడుగులు తినవచ్చు.
తద్వారా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.అలాగే వీటిల్లో ఉండే కాపర్.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.క్యాన్సర్ కణాలను కట్టడి చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి.
సో.పుట్టగొడుగులను కనీసం వారానికి ఒకసారైన తినడానికి ప్రయత్నించండి.