యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పట్లో కరోనా మహమ్మారి తగ్గే సూచన కనిపించకపోవడంతో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారా అనే సందేహం అందరిలో నెలకొంది.అయితే కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పట్లో మొదలుపెడతారో లేదో అని అందరూ అనుకున్నారు.
కానీ ప్రస్తుతం ఇరత సినిమా షూటింగ్‌లు మొదలవడంతో రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ను కూడా అన్ని జాగ్రత్తల మధ్య సెప్టెంబర్ నెల మధ్యలో నుండి తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ క్రమంలో ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని చూస్తున్నాడట.
కాగా పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఇందులో ప్రభాస్ వింటేజ్‌లుక్‌లో దర్శనమిస్తున్నాడు.ఇక ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.