పెళ్లికూతురు చీరలో శోభిత.. చైతన్య శోభిత కలకాలం సంతోషంగా ఉండాలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది డిసెంబర్ నెల 4వ తేదీ ఒకింత ప్రత్యేకం అని చెప్పవచ్చు.డిసెంబర్ 4వ తేదీన పుష్ప ది రూల్(Pushpa the Rule) మూవీ రిలీజ్ కానుండగా అదే సమయంలో ఆరోజు రాత్రి 8.13 గంటలకు చైతన్య శోభిత పెళ్లి జరగనుంది.నాగచైతన్యకు(Naga Chaitanya) ఈ పెళ్లి రెండో పెళ్లి అనే సంగతి తెలిసిందే.

 Shobhita Shares Her Look Bride Look Photos Details Inside Goes Viral In Social M-TeluguStop.com

పెళ్లికూతురు చీరలో శోభిత(Shobhita) మెరిసిపోతుండగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చైతన్య శోభిత(Chaitanya Shobhita) కలకాలం సంతోషంగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

శోభిత మరో రెండు రోజుల్లో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు.ఇప్పటికే పెళ్లి వేడుకలు ప్రారంభం కాగా వధూవరులకు మంగళ స్నానాలు చేయించడంతో పాటు శోభితను పెళ్లికూతురుగా ముస్తాబు చేయడం జరిగింది.

మంగళ హారతులు ఇవ్వగా శోభిత ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Telugu Naga Chaitanya, Pushpa Rule, Shobhita-Movie

సంప్రదాయ చీరకట్టులో శోభిత మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం ఒక ఓటీటీ ఈవెంట్ లో పరిచయం ఏర్పడింది.మా ఇద్దరి మధ్య చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయని అటు చైతన్య ఇటు శోభిత చెబుతున్నారు.

శోభిత కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అందుకే తనతో లైఫ్ పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చైతన్య అన్నారు.

Telugu Naga Chaitanya, Pushpa Rule, Shobhita-Movie

శోభిత మాట్లాడుతూ చైతన్య చాలా కామ్ గా కూల్ గా ఉంటాడని ఆడంబరాలను ప్రదర్శించడని అందరితో హుందాగా వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చారు.చైతన్య శోభిత ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు.చైతన్య శోభిత మధ్య ఆరేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

చైతన్య శోభిత రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.చైతన్య శోభితలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube