దేవర (Devara)సినిమాతో మంచి విజయాన్ని సాధించిన జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) తన దగ్గర సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఎన్టీఆర్…ఇకమీదట సినిమాలతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్న ఎన్టీయార్(NTR) పాన్ ఇండియాలో భారీ రేంజ్ లో సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
ఇక తన తోటి హీరోలందరూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ భారీ మార్కెట్ ను కొల్లగొడుతుంటే ఎన్టీఆర్ మాత్రం 300 కోట్ల దగ్గర ఆగిపోతున్నాడు.కారణం ఏంటి అంటే ఆయన సినిమాలో క్వాలిటీ ఉన్నప్పటికీ క్రేజ్ పరంగా ఆయన వెనకబడి ఉన్నాడు.
ఆ రీజన్ తోనే ఆయన సినిమా కి మంచి సక్సెస్ టాక్ వచ్చిన కూడా భారీ వసూళ్లు రావడం లేదు.ఇక ఆయన తన క్రేజ్ ను పెంచుకున్నట్లైతే సినిమా భారీ ఓపెనింగ్స్ లో రాబడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
తద్వారా ప్రేక్షకుల్లో ఆయన సినిమాలు చూడాలనే అసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.అందుకే సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఎన్టీఆర్ మీద క్రేజ్ పెరగాలంటే ఆయన సినిమా మీద భారీగా ప్రమోషన్స్ చేయించుకోవడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి తో ముందుకు దూసుకెళ్లాలి.
అలాంటప్పుడే వాళ్లకి స్వతహాగా ఫ్యాన్స్ ఉండడమే కాకుండా వాళ్ళ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఎన్టీఆర్ బాలీవుడ్ (NTR Bollywood)ప్రేక్షకులను మ్యాజిక్ చేయాలంటే మాత్రం భారీ క్రేజ్ ను సంపాదించుకోవాలి ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.దానికి తోడుగా ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ కి కూడా పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉంది.కాబట్టి ఆయన కూడా ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది…