సాధారణంగా కొందరి దంతాలు చాలా వైట్ గా బ్రైట్ గా మెరిసిపోతూ ఉంటాయి.కానీ కొందరు దంతాలు మాత్రం పసుపు రంగులో( Yellow Teeth ) అసహ్యంగా కనిపిస్తుంటాయి.
దంత సంరక్షణ లేకపోవడం, పలు రకాల మందుల వాడకం, స్మోకింగ్, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల దంతాలపై పసుపు మరకలు పడుతుంటాయి.వాటిని వదిలించుకునేందుకు ఖరీదైన టూత్ పేస్ట్ లను వాడుతుంటారు.
అయినా సరే ఫలితం ఉండటం లేదా? డోంట్ వర్రీ.దంతాలపై పసుపు మరకలను మాయం చేయడానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో ఎఫెక్టివ్ గా తోడ్పడతాయి.
ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఆ కోవకు చెందిందే.
అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic Turmeric ) వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా,( Baking Soda ) పావు టీ స్పూన్ సాల్ట్( Salt ) వేసుకుని మూడిటిని కలుపుకోవాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టీ స్పూన్ రెగ్యులర్ టూత్ పేస్ట్ మరియు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆవ నూనె వేసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.
ఈ రెమెడీని కనుక పాటించారంటే దంతాలపై ఏర్పడిన పసుపు మరకలు వదిలి పోతాయి.దంతాలు తెల్లగా కాంతివంతంగా మారతాయి.అలాగే ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించడం వల్ల దంతాల నొప్పి మరియు వాపు నుంచి ఉపశమనం పొందుతారు.కావిటీల సమస్య దూరం అవుతుంది.పసుపులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడి దంతాలను ఆరోగ్యంగా మార్చడానికి సహాయపడతాయి.