బీట్ రూట్ జ్యూస్ త‌ల‌కు రాయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా?

బీట్ రూట్( Beetroot ) గురించి పరిచయాలు అక్కర్లేదు.ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డానికి చాలా మంది ఉదయం టీ కాఫీలకు బదులుగా బీట్ రూట్ జ్యూస్( Beetroot Juice ) తీసుకుంటున్నారు.

 Do You Know What Happens When You Apply Beetroot Juice To Your Scalp Details, B-TeluguStop.com

హెల్త్ పరంగా బీట్ రూట్ చాలా ప్రయోజనాలను అందిస్తుంది.జుట్టు సంరక్షణకు( Hair Care ) సైతం తోడ్పడుతుంది.

బీట్ రూట్ జ్యూస్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తలకు రాస్తే మీరు ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ బీట్ రూట్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగు,( Curd ) వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) మ‌రియు వన్ టీ స్పూన్ హనీ( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Beet Root, Beetroot, Coconut Oil, Curd, Care, Care Tips, Healthy, Honey,

వారానికి ఒకసారి ఈ బీట్ రూట్ మాస్క్ ను వేసుకుంటే మంచి లాభాలు పొందుతారు.బీట్ రూట్‌లో ఐరన్ ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్ల‌కు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లి ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.బీట్ రూట్ లో ఉండే కెరోటినాయిడ్స్ తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.జుట్టు రాలే స‌మ‌స్య‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి.

Telugu Beet Root, Beetroot, Coconut Oil, Curd, Care, Care Tips, Healthy, Honey,

అలాగే బీట్ రూట్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.అందువ‌ల్ల త‌ల‌కు బీట్ రూట్ జ్యూస్ ను రాస్తే చుండ్రు స‌మ‌స్య‌ను వ‌దిలించుకోవ‌చ్చు.ఇక పెరుగు, తేనె మ‌రియు కోకోన‌ట్ ఆయిల్ జుట్టుకు చ‌క్క‌ని పోష‌ణ అందిస్తాయి.స్కాల్ప్ ను తేమ‌గా ఉంచుతాయి.శిరోజాలను కాంతివంతంగా మెరిపిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube