దేవర సినిమాతో మంచి విజయాన్ని సాధించిన కొరటాల శివ(Koratala Siva) ప్రస్తుతం తన తదుపరి సినిమాను ఎవరితో చేయాలి అనే డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరూ వరుసగా రెండు మూడు సినిమాలతో బిజీ కావడం వల్ల ఆయనకు డేట్స్ ఇచ్చే హీరో దొరకడం లేదు.
మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక అందులో భాగంగానే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక దాంతోపాటుగా కొరటాల శివ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది.ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే లేదు.
కానీ తొందర్లోనే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ ఒక అనౌన్స్ మెంట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా దేవర లాంటి ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత కొరటాల శివ ని ఏ స్టార్ హీరో పట్టించుకోకపోవడం అనేది నిజంగా ఆయన బ్యాడ్ లక్ అనే చెప్పాలి.ఇక స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉండడం వల్లే అతన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ ఇప్పుడు భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరం అయితే ఉంది…
.