వైసీపీ అధినేత జగన్(Jagan) తీసుకుంటున్న తాజా నిర్ణయాలపై పార్టీ క్యాడర్ లోనూ అయోమయం నెలకొంది.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి(YCP) ఘోరంగా ఓటమి చెందడం , టిడిపి , జనసేన, బిజెపి కూటమి(TDP, Janasena, BJP alliance) అధికారంలోకి రావడంతో వైసిపి కేడర్ పూర్తిగా నిరాశకు గురయ్యింది.
ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నేతలు చాలామంది కూటమి పార్టీల్లో చేరిపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ గందరగోళ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో , ఆ పరిస్థితిని చక్కదిద్ది, మళ్లీ పార్టీ కేడర్ లో ఉత్సాహం పెంచేందుకు జిల్లాల పర్యటనకు జగన్(Jagan’s district tours) శ్రీకారం చుట్టబోతున్నారు.సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రతి బుధ, గురువారాల్లో కార్యకర్తలతో ఉండే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.ప్రతిరోజు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జగన్ చేయనున్నారు.
ఇప్పటికీ ఈ విషయాలను జగన్ అధికారికంగా ప్రకటించారు.అంటే రాబోయే సంక్రాంతి తర్వాత నుంచి జగన్ పూర్తిగా జనాల్లో ఉంటూ, పార్టీ కేడర్ లో ఉత్సాహం పెంచే పని మీదే ఉండబోతున్నారు.వైసిపి(YCP) అధికారంలో ఉండగా పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని , ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించిందనే విషయం జగన్ గుర్తించారు.
అందుకే కార్యకర్తలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.వైసీపీ అధికారంలో ఉండగా కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే, ఎన్నికల్లో పార్టీ క్యాడర్ మనస్ఫూర్తిగా పనిచేయలేదని, చాలాచోట్ల పార్టీ క్యాడర్ దూరంగా ఉన్నారని, జగన్ పూర్తిగా వాలంటీర్లపైనే నమ్మకం పెట్టుకోవడంతో పాటు, సంక్షేమ పథకాలే మళ్లీ తమను అధికారంలోకి తీసుకువస్తాయనే నమ్ముకంతో ఉంటూ వచ్చారు.
కానీ ఎన్నికల్లో అవేమీ వర్కౌట్ కాకపోవడంతో పార్టీ కేడర్ ఎవరు పోలింగ్ సమయంలో హడావుడి చేయలేదు.ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు .దీంతో ఎన్నికల ఫలితాలు తర్వాత అసలు విషయం జగన్ కు అర్థమైంది.పార్టీ క్యాడర్(Party cadre) గుర్తించకపోతే ఎంత నష్టం జరుగుతుందో జగన్ గుర్తించారు .అందుకే ఇప్పుడు.
కార్యకర్తలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే జగన్ జిల్లాల పర్యటనకు కేడర్ పూర్తిస్థాయిలో హాజరవుతారా అంటే అది అనుమానమే .ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ తరఫున వీధుల్లోకి వచ్చి పోరాటం చేసేందుకు వైసిపి క్యాడర్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. అదీ కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే అవుతుండడంతో, కొంత సమయం ఇస్తే బాగుంటుందని , అప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తే జనాల్లోనూ గుర్తింపు ఉంటుందని, ఇప్పటికిప్పుడు జగన్ పర్యటనలు చేసినా అనవసరపు ఖర్చు తప్ప , ఫలితం ఉండదు అనే అభిప్రాయాలు పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.