ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ వివాదం( Manchu Family Controversy ) సంచలనంగా మారిన విషయం తెలిసిందే.గత రెండు రోజులుగా ఈ ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.
కొట్టుకోవడం తిట్టుకోవడం ఆడియోలు వీడియోలు లీక్ అవడం, హాస్పిటల్ పాలు అవడం ఇవన్నీ జరిగిపోయాయి.ఈ మేరకు ఇందుకు సంబంధించి చాలా రకాల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
మోహన్ బాబు తన చిన్నకొడుకు విషయంలో తప్పు చేసారా?లేదంటే మనోజ్ ది తప్పా అనేది క్లారిటీ లేకపోయినా ముందు నుంచి మోహన్ బాబు( Mohan Babu ) ఈ విషయంలో నలిగిపోతున్నారని మీడియా సింపతీ చూపించినా తర్వాత మోహన్ బాబు మీడియాపై చేయి చేసుకోవడంతో ఆయనకు మీడియా యాంటీ అయ్యింది.

ఎప్పుడైతే మోహన్ బాబు మీడియా పై చేయి చేసుకున్నారో అక్కడి నుంచి మనోజ్( Manoj ) పై సింపతి మొదలయ్యింది.మోహన్ బాబు మీడియా జర్నలిస్ట్ పై చేయి చేసుకోకముందు మంచు మనోజ్ తన ఇంట్లో బిహేవ్ చేసిన వీడియో చూసాక అందరూ మంచు మనోజ్ తప్పు చేశాడా అనేలా ఫీల్ అవుతున్నారు.మోహన్ బాబు అలాగే ఇంకొంతమంది అక్కడ ఉండగా మనోజ్ వారిపై కేకలు వేస్తున్న వీడియో అది.మోహన్ బాబు నచ్చజెప్పుతున్నప్పటికీ వినిపించుకోకుండా ముందుకు దూసుకెళ్లడం ఇందులో రికార్డయింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో మంచు వివాదంలో మొత్తం తప్పు మనోజ్ దేనా అన్న అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఎవరో ఒక పెద్దాయనని పట్టుకుని మనోజ్ నువ్వెవడివిరా మాఇంటి కొచ్చి నాకు చెబుతున్నావ్, మా గొడవకు నీకు సంబంధం ఏమిటి అంటూ గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు.

మోహన్ బాబు సహా పక్కన ఉన్న వాళ్లు వెనక్కి లాగుతున్నప్పటికీ తూలుతూ ముందుకు వెళ్లడం ఈ వీడియోలో చూడవచ్చు.అయితే ఈ వీడియో చూశాక చాలామంది ఈ గొడవలో మోహన్ బాబు మంచు మనోజ్ బిహేవియర్ గురించి చెప్పిందే నిజమనుకునేలా ఉండడంతో మనోజ్ దే తప్పా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకోవడం హైలెట్ అయ్యింది.మరి ఈ విషయంపై మనోజ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.