ఈ రోజుల్లో అధిక బరువు అనేది వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా కూడా లేకుండా పెద్ద సమస్యగా మారింది.అధిక బరువు కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి.
ఆ సమస్యల ప్రభావం మనం చేసే పని మీద పడుతుంది.అధిక బరువు కారణంగా చురుకుదనం కూడా తగ్గుతుంది.
బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం.కానీ అవి సత్పలితాలను ఇవ్వవు.
కొంత మంది డైటింగ్,వ్యాయామం చేసిన అనుకునంతగా బరువు తగ్గరు.అలాంటి వారి కోసం మంచి చిట్కా ఉంది.
ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ఈ చిట్కాకు కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలుజీలకర్ర 1 స్పూన్సోంపూ 1 స్పూన్వాము 1 స్పూన్
జీలకర్ర ,సోంపూ,వాము మూడింటిని సమన పరిమాణంలో తీసుకోని మెత్తగా మిక్సీ చేయాలి.మూడు కప్పుల నీటిలో ఈ పొడిని వేసి బాగా మరిగించాలి.
ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే త్రాగాలి.ఈ నీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు, రాత్రి పడుకోవటానికి అరగంట ముందు త్రాగాలి.
ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ డ్రింక్ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరగటానికి బాగా సహాయపడుతుంది.
పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.దాంతో నాజూగ్గా కనపడతారు.
ఇది శరీరంలో మెటబాలిజం రేట్ ని పెంచటం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి క్యాలరీలు శక్తిగా మారతాయి.ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ డ్రింక్ ని త్రాగి అధిక బరువు సమస్య నుండి బయటపడండి.